తెలంగాణ

telangana

ETV Bharat / state

అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలి : అల్లుఅర్జున్ - ALLU ARJUN APPEAL TO FANS

అభిమానులకు అల్లు అర్జున్‌ ఎక్స్‌ వేదికగా విజ్ఞప్తి - ఫ్యాన్స్ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలి

ALLU ARJUN APPEAL TO FANS
ALLU ARJUN APPEAL TO FANS (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 11 hours ago

Updated : 10 hours ago

Allu Arjun Appeal To Fans : సోషల్​ మీడియాలో నెగెటివ్‌ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని తన అభిమానులకు హీరో అల్లు అర్జున్‌ సూచించారు. ఈ మేరకు సోషల్​ మీడియా ఎక్స్​ వేధికగా అర్జున్​ ఓ లేఖ విడుదల చేశారు. తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు పెట్టవద్దని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్స్‌ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్‌ ఐడీ, ప్రొఫైల్స్‌తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని అర్జున్​ తెలిపారు. నెగెటివ్‌ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌లోనే కాదు ఆఫ్‌లైన్‌లోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అర్జున్​ కోరారు.

"నా ఫ్యాన్స్​ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు వేయవద్దని విన్నపం. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడీ, ఫేక్​ ప్రొఫైల్స్​తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. నెగిటివ్​ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని నా ఫ్యాన్స్​కు సూచిస్తున్నాను"- అల్లు అర్జున్​ ట్వీట్​

Last Updated : 10 hours ago

ABOUT THE AUTHOR

...view details