ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"9, 11, 16, 21" ఇవి వైఎస్సార్సీపీ పాలనలో ఏపీ ర్యాంకులు - పతనాన్ని కళ్లకు కట్టిన సుస్థిర అభివృద్ధి సూచిక - SOCIOECONOMIC SURVEY AP

వైఎస్సార్సీపీ పాలనలో అన్ని రంగాలు అస్తవ్యస్తం-2023-24 సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి

sectors_destroyed_in_ysrcp_ruling
sectors_destroyed_in_ysrcp_ruling (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 19, 2024, 9:19 AM IST

ALL Sectors Destroyed in YSRCP Ruling : వైఎస్సార్సీపీ పాలనలో అన్ని రంగాలు ఎలా అస్తవ్యస్తంగా మారాయో 2023-24 సామాజిక ఆర్ధిక సర్వే కళ్ల ముందుంచింది. 2022-23తో పోలిస్తే జీఎస్​డీపీ (GSDP) వృద్ధిలో 3.1 శాతం తగ్గిపోయింది. తలసరి ఆదాయం 1.21 శాతం పడిపోయింది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలు గతేడాది నేలచూపే చూశాయి. సాగు, ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా భారీగా పడిపోయింది. సుస్థిర అభివృద్ధి సూచికల్లో రాష్ట్రం 3వ స్థానం నుంచి 9వ స్థానానికి దిగజారిందని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది.

వైఎస్సార్సీపీ హయాంలో అన్ని రంగాలను ఎంతలా భ్రష్టు పట్టించారో 2023-24 సామాజిక ఆర్ధిక సర్వే బయటపెట్టింది. 2014-18 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే 2019-24 మధ్య వైఎస్సార్సీపీ హయాంలో GSDP, తలసరి ఆదాయం సహా వ్యవసాయం, సేవా రంగాల్లో వృద్ధి రేటు భారీగా తగ్గింది. 2022-23తో పోల్చినా 2023-24లో వృద్ధి రేటు బాగా క్షీణించింది. 2022-23లో GSDP వృద్ధి 13.5% ఉండగా 2023-24లో ముందస్తు అంచనాల మేరకు ఇది 10.4% మాత్రమే అంటే 3.1% తగ్గింది. ఇదే కాలంలో తలసరి ఆదాయంలోనూ వృద్ధి 11.49% నుంచి 10.28%కి దిగజారి 1.21% తక్కువగా నమోదైంది.

ఆహారధాన్యాల ఉత్పత్తి 22 లక్షల టన్నులు తగ్గింది. 2023-24లో GSDP 14.40 లక్షల కోట్లు, తలసరి ఆదాయం 2లక్షల 42వేల 479 రూపాయలు ఉందని సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన 'సామాజిక ఆర్థిక సర్వే 2023-24' వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.

"9, 11, 16, 21" ఇవి వైఎస్సార్సీపీ పాలనలో ఏపీ ర్యాంకులు - పతనాన్ని కళ్లకు కట్టిన సుస్థిర అభివృద్ధి సూచిక (ETV Bharat)


వైఎస్సార్సీపీ అస్తవ్యస్త నిర్ణయాలు - రాష్ట్ర అప్పుల భారం రూ.10.86 లక్షల కోట్లు
వైఎస్సార్సీపీ పాలనలో వ్యవసాయంలో వృద్ధి రేటు భారీగా తగ్గింది. ఒక్క ఏడాది కూడా 10%మించలేదు. 2022-23లో 3%, గతేడాది మరింత ఘోరంగా 1.69% మాత్రమే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. తమ పాలనలో వ్యవసాయం అద్భుతమంటూ అయిదేళ్లపాటు తమ భుజాలు తామే చరచుకోవడం తప్పితే వాస్తవ ప్రగతి మాత్రం శూన్యమని సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.

రైతుల ఆదాయం, సాగు విస్తీర్ణం ఏటికేడు తగ్గిపోయాయి. ఆహారధాన్యాల ఉత్పత్తి క్షీణించింది. 2022-23లో 92 లక్షల ఎకరాల్లో ఆహారధాన్యాల పంటలు వేయగా 2023- 24లో 13.15% తగ్గి కేవలం 83 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. ఇదే కాలంలో ఉత్పత్తి కూడా 168.41 లక్షల టన్నుల నుంచి 146.65 లక్షల టన్నులకు పడిపోయింది. అంటే 2022-23 నాటితో పోలిస్తే 2023-24లో ఉత్పత్తి 12. 92% తగ్గింది. 2014-19 మధ్య సాగు విస్తీర్ణం 151 లక్షల ఎకరాలు ఉండగా 2019-24 మధ్య 123.90 లక్షల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది.


టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే అయిదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో పారిశ్రామిక ప్రోత్సాహకాలకూ కోత పెట్టారు. గతేడాది కేవలం 205కోట్ల 41లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు. 2018-19నాటి ప్రోత్సాహకాలతో పోలిస్తే 550 కోట్ల రూపాయలు తగ్గించారు.సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో దేశానికే మార్గదర్శకంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్​ వైఎస్సార్సీపీ పాలనలో నిరాశాజనక పనితీరు కనబరిచింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 2018-19లో దేశంలో మూడో స్థానంలో ఉన్న రాష్ట్రం 2020-21లో నాలుగో స్థానంలోకి చేరింది. 2023-24లో 9వ స్థానానికి దిగజారింది. ఆరోగ్యం, సంతోషకర జీవనాల్లోనూ 2020-21లో 7వ స్థానంలో ఉన్న ఏపీ 11వ స్థానానికి పారిశ్రామికవృద్ధిలో 6 నుంచి 16, పరిశ్రమలు, మౌలిక సౌకర్యాల్లో 13 నుంచి 21వ స్థానానికి పడిపోయింది.

నాడు-నేడు అంటూ ఊదరగొట్టినా.. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య 2 లక్షలు తగ్గింది. 2018- 19లో ప్రభుత్వ పాఠశాలల్లో 36.14 లక్షల మంది విద్యార్థులుండగా 2023-24లో 34.14 లక్షల మంది మాత్రమే ఉన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. బియ్యం, కందిపప్పు, చింతపండు, ఉల్లిపాయలు వంటి వాటి ధరలు పైపైకి ఎగబాకాయి. జగన్ హయాంలో రాష్ట్రంలో విమానయాన రంగం పూర్తిగా ఢీలా పడింది. రాష్ట్ర ప్రగతికి ఒక సూచీగా భావించే ఆ రంగంలో వృద్ధి కనిపించలేదు.

అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు సగానికి సగం తగ్గాయి. 2018-19లో వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి 1,21,630 మంది రాకపోకలు సాగిస్తే.. 2023-24 నాటికి ఈ సంఖ్య 66,192కి పడిపోయింది. అంటే సుమారు 45.58 శాతం మేర ప్రయాణికులు తగ్గిపోయారు. రాష్ట్రంలోని విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాల మధ్య ప్రయాణించే వారి సంఖ్య కూడా స్వల్పంగా తగ్గింది.

అప్పుల్లో ఆంధ్ర టాప్​ - గ్రామీణ మహిళలే ముందంజ - అది ఎలాగంటే?

ABOUT THE AUTHOR

...view details