All India Telugu Literature Conference in Kakinada :నేటి తరం ఆంగ్ల భాషకు ఇచ్చిన ప్రాముఖ్యత మాతృ భాషకు ఇవ్వడం లేదు. భాష వ్యక్తీకరణ మాత్రమే కాకుండా తెలుగు జాతి సంస్కృతికి భాష అద్దం పడుతుందంటారు పెద్దలు. కానీ సాహిత్యాన్ని మాత్రం కవులు పలు భాషల్లోకి అనువాదం కూడా చెయ్యడం ముఖ్యమంటున్నారు మరికొందరు భాషా కోవిదులు. కాకినాడలో జరిగిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు సాహితీవేత్తలు పాల్గన్నాారు. వారు సాహిత్యానికి (Literature), సమాజానికి భాష ఏ విధంగా దోహదపడుతుందని వివరించారు.
సాహిత్యమే ఆయుధంగా బతికిన 'ఆశాజీవి' గొల్లపూడి
Venkaiah Naidu in All India Telugu Literature Conference : భావ వ్యక్తీకరణకు భాష ఎంతో తోడ్పడుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు. కాకినాడలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. భాష లేనిదే సమాజం అభివృద్ధి చెందలేదని సంస్కృతి ఎల్లలు దాటదని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్తగా వచ్చే రచయితలు తమ రచనలకు మార్కెటింగ్ చేసుకోవడం ఎంతో ముఖ్యమని ప్రతిఒక్కరూ తమ రచనలు హిందీలో అనువాదం అయ్యేలా చూసుకోవాలని ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (Yarlagadda LaxmiprasaD) అన్నారు. నాడు తాను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అనధికార తీర్మానం వల్లే నేడు పాఠశాలల్లో తెలుగు భాష తప్పనిసరిగా బోధిస్తున్నారని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ గుర్తుచేశారు.