తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇప్పటివరకూ పోలీస్‌ స్టేషన్‌ అంటే తెలియని గ్రామం - ఎక్కడుందో తెలుసా? - BEST VILLAGE AKUSAIPALLE

అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆకురాయిపల్లె గ్రామం - కలసికట్టుగా జీవనం సాగిస్తూ ముందుకు - పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కని గ్రామం

Akusaipalle Village
Akusaipalle Village (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2025, 2:16 PM IST

Akusaipalle Village :సమష్టి కృషి ఉంటే ఎంతో నిరూపిస్తోంది ఈ గ్రామం. అందరూ కలిసికట్టుగా జీవనాన్ని సాగిస్తూ ఎలాంటి గొడవలు, పంచాయితీలు లేకుండా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామమే కరీంనగర్‌ జిల్లాలోని ధర్మపురి మండలంలో ఉన్న ఆకుసాయిపల్లె గ్రామం. ఈ గ్రామంలో వంద శాతం మంది గిరిజులు ఉన్నారు. అయినా వారేప్పుడూ పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కలేదు. వివాదాలు, ఘర్షణలు ఏమీ తెలియని పల్లె అది. ఇక్కడి ప్రజలంతా శాంతియుతంగా, సోదర భావంతో, సహనంగా ఉంటూ కలిసిమెలసి మెలుగుతున్నారు. దశాబ్దాలుగా ఒకరికి ఒకరు అండగా ఉంటూ ఎలాంటి వివాదాలు లేకుండా జీవనం సాగిస్తున్నారు. ఈ పల్లె ధర్మపురి నుంచి జగిత్యాల వైపు వెళ్లే జాతీయ రహదారి పక్కనే ఉంటుంది.

అభివృద్ధిలో ముందుకు : ప్రభుత్వ పథకాల అమలులో సైతం ఇక్కడి ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పరిశుభ్రత, స్వచ్ఛత, మొక్కల పెంపకంలో అందరూ కలిసకట్టుగా భాగస్వామ్యం అవుతూ ముందుకు సాగిపోతున్నారు. ఈ పల్లెలో స్వశక్తి సంఘాలు ఉండగా, రూ.20 లక్షల వరకూ రుణాలు తీసుకొని వాటిని సమృద్ధిగా వినియోగించుకుంటూ సంఘాల పటిష్ఠతకు ఎంతో కృషి చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పిల్లలు మెరుగైన విద్యా బుద్ధులు నేర్పేందుకు వారి తల్లిదండ్రులు ఎంతో కృషి చేస్తున్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులు వారిని క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపిస్తున్నారు. ప్రధాన రోడ్ల వెంట మొక్కలు నాటి ఆ సంరక్షణ బాధ్యతలను విద్యార్థులకే అప్పగించారు. ఈ గ్రామం ఐదేళ్ల క్రితమే నూతనంగా పంచాయతీగా ఏర్పడి, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఇక్కడ వంద శాతం చేపట్టారు. సమీపంలోని చెరువే స్థానికులకు ప్రధాన నీటి వనరు. ఈ చెరువు కిందే పత్తి, వరి, మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారు. పదేళ్ల క్రితం వరకు ఏమాత్రం సదుపాయాలు లేని ఈపల్లెలో నేడు మెరుగైన సదుపాయాలు, అంతర్గత సీసీ రోడ్లు, రహదారులు, మురుగు కాలువలు, తాగు నీరు, విద్యుత్తు సరఫరా, అంగన్‌వాడీ కేంద్రాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

వర్షాధారంగానే పండిస్తున్న పంటలు :ఆకుసాయిపల్లె గ్రామంలో వర్షాధారంగానే పంటలను పండిస్తున్నారు. నేరెళ్ల గుట్టపై నుంచి వచ్చే నీరు సమీపంలోని బ్రాహ్మణకుంట వద్దకు చేరుతుంది. చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టి ఈ నీటి ఆధారంగానే పంటలను సాగు చేస్తున్నారు. మిర్చి, పసుపు, పత్తి, మొక్కజొన్న పంటలను పండిస్తున్నారు.

రికార్డులోనే లేదు :ఇక్కడి ధర్మపురి మండలంలో 29 గ్రామాలు ఉండగా ఆకుసాయిపల్లె నేటికీ పోలీసు రికార్డుల్లో ఎక్కలేదు. మిగతా అన్ని గ్రామాల్లో వివిధ రకాల కేసులు నమోదు అయ్యాయి. ఈ పల్లెల్లో ప్రజలు సోదర భావంతో మెలుగుతున్నారు. ఈ గ్రామం సమష్టి జీవనానికి ప్రతిబింబంగా నిలుస్తోందని ధర్మపురి ఎస్సై ఉదయ్‌ కుమార్‌ తెలిపారు.

ఏళ్ల తరబడి ఐకమత్యంగా : గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా అందరం స్పందించి అంతడగా నిలుస్తామని ఆకుసాయిపల్లె మాజీ సర్పంచి రమేశ్‌ తెలిపారు. ఎవరి ఇంట్లో వేడుక జరిగినా అందరం కలిసికట్టుగా జరుపుకుంటామన్నారు. గ్రామ అభివృద్ధికి సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటామని, ఏళ్లుగా ఎటువంటి వివాదాలకు తావివ్వలేదని తెలిపారు. ఇది మాకు గర్వ కారణం, నూతన పంచాయతీ కావడంతో కొద్దిపాటి నిధులు మాత్రమే వచ్చాయి. వాటినే పొదుపుగా వాడుకుంటూ అందరి సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

ఆదర్శంగా నిలుస్తున్న 'లక్ష్మీనగర్‌' - గ్రామానికి ఘనంగా బర్త్​ డే వేడుకలు

'పసుపు'మయంగా మారిన ఆ గ్రామం - అసలు కథ ఏంటంటే?

ABOUT THE AUTHOR

...view details