Air Pollution During Diwali Festival : దీపావళి అంటే ప్రతి ఒక్కరూ టపాసులు పేల్చటానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే క్రాకర్స్ పండుగ సందడిని రెట్టింపు చేసినప్పటికీ కూడా వాయు కాలుష్యం పెరగటానికి దోహదపడుతుంటాయి. సాధారణంగానే నగరాలలో వాయు కాలుష్యం అధికంగా ఉంటుంది. జనాభా అనుగుణంగా పెరిగిన వాహనాలు, వాటి నుంచి విడుదలయ్యే ఉద్గారాలు గాలి క్వాలిటీని బాగా తగ్గిస్తాయి. అయితే ఈ ఏడాది దీపావళి వల్ల హైదరాబాద్ నగరంలో వాయి కాలుష్యం మోడరేట్‌గా ఉందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో వాయు కాలుష్యం : గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లో కాస్త వాయు కాలుష్యం అధికంగా ఉంటుంది. దీపావళి సమయంలో విడుదలయ్యే వాయువుల వల్ల తీవ్రమైన గాలి కాలుష్యం జరిగి, చాలా మంది అనారోగ్యం బారిన పడుతుంటారు. ఈ ప్రభావం ఎక్కువగా నగర ప్రాంతాల్లో ఉంటుంది. ఎక్కువగా రాత్రి సమయంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది హైదరాబాద్ నగరంలో సాధారణంగానే ఉందని అధికారులు తెలిపారు.
దీపావళి సందర్భంగా :ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా కొంతమేర వాయు కాలుష్యం జరుగుతూ ఉంటుంది. ఈ ఏడాది మాత్రం నగరంలో వాయు కాలుష్యం పెద్దగా జరగలేదని అధికారులు తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి 11 వరకు టపాసులు పేల్చినప్పటికీ కొన్ని గంటల పాటు మాత్రమే ఆ ప్రభావం ఉందని వారు తెలిపారు. వరంగల్, హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా వాతావరణ కాలుష్యం పెద్దగా జరగలేదని, వాతావరణ కాలుష్యం చాలా తక్కువగా ఉందని వారు తెలిపారు. అయితే ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.