ActorRam Charan 256 Feet Cutout Inauguration in Vijayawada :విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో నటుడు రామ్ చరణ్ భారీ కటౌట్ వెలిసింది. గేమ్ ఛేంజర్ చిత్రం విజయవంతం కావాలని కోరుతూ రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో 256 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. రామ్ చరణ్ కటౌట్ ఇంటర్నేషనల్ వండర్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. నిర్మాత దిల్ రాజు రికార్డు సంస్థ ప్రతినిధుల నుంచి అవార్డను అందుకున్నారు. ఇవాళ సాయంత్రం రామ్ చరణ్ కటౌట్‌ను ఆవిష్కరించారు. హెలికాప్టర్ ద్వారా కటౌట్‌పై పూలు వర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి గేమ్ ఛేంజర్ చిత్ర బృందం, తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానుల నాయకులు హాజరయ్యారు.
ప్రీ రిలీజ్‌కు పవన్ కల్యాణ్ : ఈవెంట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వస్తే ఏపీలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహిస్తామని దిల్ రాజు తెలిపారు. గేమ్‌ఛేంజర్ సినిమా చూసి చిరంజీవి సంతోషించారని చెప్పారు.
జనవరి 1న గేమ్ చేంజర్ ట్రైలర్ విడుదల చేస్తామన్నారు. సినిమాలకు పుట్టినిల్లు విజయవాడ అని కితాబునిచ్చారు. మెగాస్టార్ చిరంజీవిని హీరో నుంచి మెగాస్టార్‌ను చేసింది ఈ విజయవాడ ప్రజలేనన్నారు. చిరంజీవి ఓ పవన్ స్టార్, మెగా పవర్ స్టార్‌ను తన అభిమానులకిచ్చారని దిల్ రాజ్ తెలిపారు. మెగా కుటుంబంలో పలువురి హీరోలను తయారు చేసి చిరంజీవి మెగా బాస్‌గా నిలిచారన్నారు.అమెరికాలో నిర్వహించిన ఈవెంట్ సక్సెస్ అయ్యిందన్నారు. గేమ్ ఛేంజర్‌లో మెగాను, పవర్‌ను రామ్ చరణ్‌లో చూస్తారని తెలిపారు.