తెలంగాణ

telangana

ETV Bharat / state

హెల్మెట్​, సీటుబెల్ట్​ పెట్టుకోండి - వాహనదారులకు బాలయ్య రిక్వెస్ట్ - MOTORISTS MUST WEAR HELMETS

ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్‌ ధరించాలని కోరిన సినీ నటుడు బాలకృష్ణ - హెల్మెట్‌ ధరించి బుల్లెట్‌ నడిపి అవగాహన కల్పించిన హిందుపురం ఎమ్మెల్యే

HindupurAM Transport Department
ACTOR BALAKRISHNA (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 21, 2025, 7:10 PM IST

Transport Department Awareness Program : వాహనదారులు కచ్చితంగా ముందు జాగ్రత్తతో హెల్మెట్‌, సీటుబెల్ట్​ ధరించి నడపాలని హిందూపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచించారు. ప్రాణం పోతే మళ్లీ రాదని ఈ సందర్బంగా పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా హిందూపురం రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్‌ ధరించి బుల్లెట్‌ బైక్​ నడిపారు.

‘‘బైక్‌ నడిపే వాళ్లు ముందు జాగ్రత్తగా హెల్మెట్​ను కచ్చితంగా ధరించాలి. కొన్నిసార్లు తప్పు మనవైపు జరగకపోవచ్చు, కొన్నిసార్లు మనది కూడా తప్పు కావచ్చు. ప్రమాదం ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. రోడ్డుపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా బైక్‌ నడుపుకుంటూ వెళ్లాలి. అలాగే, కారు నడిపేవాళ్లు సీటు బెల్ట్‌ పెట్టుకోవడం చాలా ముఖ్యమైన అంశం. ఒక పౌరుడిగా మీపై కూడా బాధ్యత ఉంటుంది. రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది మరణిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు సరిగా పాటించకపోతే, శిక్షలు కఠినంగా ఉంటాయి. డ్రైవింగ్​ లైసెన్స్‌ కూడా రద్దు చేస్తారు. ఈ మధ్య ఇతరులను చూసి వారిలా చేయడం ఎక్కువైపోయింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడానికి, ఇతరులకు చూపించుకోవడానికి బైక్స్‌పై స్టంట్స్​ చేస్తున్నారు. జీవితమంటే ఇది కాదు. జీవితం చాలా విలువతో కూడుకున్నది. ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని అరికట్టడానికి ఎక్కడికక్కడ సీసీటీవీలను ఏర్పాటు చేస్తోంది. నిబంధనలు అతిక్రమించి వాహనాలను నడుపుతున్న వారిపై చర్యలు తీసుకుంటారు. దయచేసి నియమ నిబంధనలు పాటించి, మీ ప్రాణాలు కాపాడుకోండి’’ -నందమూరి బాలకృష్ణ, హిందుపురం ఎమ్మెల్యే, సినీ నటుడు

బాక్సాఫీస్​ వద్ద డాకు మంచి విజయం : ఇక సినిమాల విషయానికొస్తే ఎస్​ ఎస్​ తమన్​ మ్యూజిక్​ , బాబీ దర్శకత్వంలో, బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్‌ సినిమా సంక్రాంతి పండుగకు విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుని కలెక్షన్లను రాబడుతోంది. దీని తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్​లో బాలకృష్ణ అఖండ-2లో నటించనున్నారు. ప్రస్తుతం సినిమా కోసం లొకేషన్స్‌ వెతికే పనుల్లో బోయపాటి శ్రీను బిజీగా ఉన్నారు. ఇటీవల తన టీమ్‌తో కలిసి ప్రయాగ్​రాజ్​లోని కుంభమేళాలో కొన్ని సన్నివేశాలను షూట్‌ చేసుకొని వచ్చారు.

సెకెండాఫ్​పై 'డాకు' ఎఫెక్ట్​ - బాలకృష్ణ కెరీర్‌లో నిలిచిపోయే పాత్ర ఇది! : డైరెక్టర్ బాబీ

సగం స్థలం చొప్పున నష్టపోతున్న బాలకృష్ణ, జానారెడ్డి - ఎందుకో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details