ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హీరో అల్లు అర్జున్‌కు తాత్కాలిక ఊరట - అప్పటివరకు చర్యలొద్దన్న కోర్టు

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని అల్లు అర్జున్‌పై నంద్యాలలో కేసు నమోదు - ఆ కేసు కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్‌ వేసిన అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి

Actor Allu Arjun was granted temporary relief in AP High Court
Actor Allu Arjun was granted temporary relief in AP High Court (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Actor Allu Arjun Granted Temporary Relief in AP High Court : ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌కి ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టేయాలని అల్లు అర్జున్‌, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి వేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఆ ఎఫ్ఐఆర్(FIR) ఆధారంగా నవంబర్ 6 వరకూ తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. నవంబర్ 6న తగిన ఉత్తర్వులిస్తామని హైకోర్టు వెల్లడించింది.

Allu Arjun Petition in AP HC : ఏపీ హైకోర్టులో సినీనటుడు అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్​లో ఆయన కోరారు. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా జనసమీకరణ చేపట్టారంటూ అల్లు అర్జున్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు.

అసలేం జరిగిదంటే :మే 11న అల్లు అర్జున్ నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్​రెడ్డి మద్దతుగా నంద్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎలాంటి అనుమతులూ తీసుకోకుండా భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నప్పటికీ వేల మందితో ర్యాలీ నిర్వహించడం పెను దుమారాన్నే రేపింది. దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నంద్యాల టూటౌన్‌ పోలీసులు అల్లు అర్జున్‌ సహా శిల్పా రవిపై కేసు నమోదు చేశారు. ఆ రోజు ఎన్నికల కోడ్​ను అమలు చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉదంతంలో ఇద్దరు కానిస్టేబుళ్లపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేశారు.

ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ - ఆ కేసు క్వాష్ చేయాలని విజ్ఞప్తి

సుకుమార్​ - అల్లు అర్జున్ మధ్య విభేదాలు? - ఇది అసలు మ్యాటర్​! - Pushpa 2 Shooting

ABOUT THE AUTHOR

...view details