తెలంగాణ

telangana

అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం - వేములవాడ గుడిలో 13 మంది ఉద్యోగులపై చర్యలు - ACTIONS ON RAJANNA TEMPLE OFFICERS

By ETV Bharat Telangana Team

Published : Apr 25, 2024, 11:33 AM IST

Updated : Apr 25, 2024, 11:45 AM IST

Higher Authorities Action Against Vemulawada Temple Officers : విధుల్లో అలసత్వం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన 13 మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు.

ACTIONS IN RAJANNA TEMPLE OFFICERS
ACTIONS IN RAJANNA TEMPLE OFFICERS

Action Against 13 Vemulawada Rajanna Temple Employees :కరీంనగర్ జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన 13 మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో వారిపై చర్యలకు ఆదేశించారు. వీరిలో ముగ్గురు ఏఈవోలు, నలుగురు పర్యవేక్షకులు, ఒక సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు పొరుగు సేవల సిబ్బంది ఉన్నారు.

ముగ్గురు ఏఈవోలు, సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్‌కు ఇంక్రిమెంట్​ను ఉన్నతాధికారులు నిలిపివేశారు. 15 రోజుల్లోగా ఆలయ ఖజానాలో రూ.1.88 లక్షలు జమ చేయాలని ప్రసాద విభాగం పర్యవేక్షకుడికి, రూ.80,000 జమ చేయాలని జూనియర్ అసిస్టెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు.

విధుల్లో నిర్లక్ష్యం - ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు - IG Suspended Six Police Officers

Last Updated : Apr 25, 2024, 11:45 AM IST

ABOUT THE AUTHOR

...view details