ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు - ఇద్దరు మృతి - ROAD ACCIDENTS IN AP - ROAD ACCIDENTS IN AP

Road Accident in various Districts: ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు గాయాల పాలయ్యారు. శుభకార్యానికి వెళ్లి తిరిగివస్తుండగా కోడూరు నుంచి అవనిగడ్డ వైపు వెళ్తున్న లారీ బైక్​ను ఢీకొనటంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎండ వేడిమికి బైక్ దగ్ధమైన ఘటన అనంతపురం జిల్లా శింగనమల మండలంలో చోటు చేసుకుంది.

Road_Accident_at_Avanigadda
Road_Accident_at_Avanigadda

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 2:19 PM IST

Road Accident at Avanigadda : కృష్ణా జిల్లా కోడూరులో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం విజయవాడకు చెందిన లంకె చందర్రావు విశ్వనాథపల్లిలో వివాహ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ కార్యక్రమం అనంతరం తిరిగి వెళ్తుండగా వీ. కొత్తపాలెం వద్ద ఘటనజరిగింది.

ఎన్టీఆర్​ జిల్లాలో స్కూల్ బస్సు-బైక్​ ఢీ - ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు - TODAY ACCIDENTS IN AP

Lorry Hit Bike One were died at Krishna District: కోడూరు నుంచి అవనిగడ్డ వైపు వెళ్తున్న మినుములు లోడు చందర్రావు బైక్​ను ఢీకొనింది. ఈ ప్రమాదంలో చందర్రావు శరీరంపైకి లారీ ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టి, లారీ డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడు ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ ఇంజినీర్​గా పని చేస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ఆసుపత్రికి తరలించారు. చందర్రావు మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Vehicle Caught Fire Due To Sun Heat at Singanamala : అనంతపురం జిల్లా శింగనమల మండలం లోలూరు క్రాస్ సమీపంలో బుధవారం 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగి దగ్ధమైంది. ముకుందాపురం గ్రామానికి చెందిన ఎండి రాముడు, ఆదిరెడ్డి అనంతపురం నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఎండ వేడిమికి వాహనంలో నుంచి మంటలు వ్యాపించాయి. మంటలు గమనించిన వెంటనే ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. ప్రమాదంలో ఎవరికి ఏటువంటి ప్రమాదంజరగలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి - ఐదుగురి పరిస్థితి విషమం - ROAD ACCIDENT IN ANDHRA PRADESH

Auto Overturned One were Died at Cumbum Mandal: ప్రకాశం జిల్లా కంభం మండలం ఎర్రబాలెం గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నాగయ్య (60) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు, నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగ్రాతులను కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరందరూ గిద్దలూరులో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి నామినేషన్​కు వెళ్లి తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అశోక్ రెడ్డి హుటాహుటిన కంభం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.

ఆర్టీసీ బస్సు బోల్తా - స్టీరింగ్ పనిచేయకపోవడంతో గుంతల్లోకి దూసుకెళ్లిన బస్సు - Bus accident in Sathyasai district

ABOUT THE AUTHOR

...view details