ACB Investigation Shiva Balakrishna : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా ఇంఛార్జ్ శివబాలకృష్ణకు ఏసీబీ కస్టడీ కొనసాగుతోంది. విచారణలో భాగంగా అతడిని నాలుగో రోజు కస్టడీకి తీసుకున్న అధికారులు బినామీల బ్యాంకు లాకర్లపై ప్రశ్నిస్తున్నారు. అతనికి ఎవరెవరు సహకరించారనే దానిపై ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణ సోదరుడు శివ సునీల్‌కుమార్ పేరిట నిందితుడు స్థిరాస్తి వ్యాపారం చేసినట్లు ఇప్పటికే గుర్తించిన అధికారులు ఆ దిశగా శివ సునీల్‌కుమార్‌ని బంజారాహిల్స్‌లోని కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. ఈ క్రమంలో అతను ఏయే సంస్థల్లో ఎంత మేరకు పెట్టుబడి పెట్టాడు. ఖరీదైన స్థలాలు, విల్లాలు ఎక్కడెక్కడ కొనుగోలు చేశాడు తదితర విషయాలపై ప్రశ్నిస్తున్నారు.
హెచ్ఎండీఏ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.100 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు
HMDA Ex Director Shiva Balakrishna Case Updates :మరోవైపు శివబాలకృష్ణకు (Rera Shiva Balakrishna) భరత్‌కుమార్ అనే బినామీ ఉన్నట్లు ఏసీబీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. అతని పేరిట నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో సుమారు పదెకరాల వ్యవసాయభూమి ఉన్నట్లు ఆధారాలు సంపాదించారు. భూమి విలువ రూ.20 లక్షలు ఉంటుందని లెక్కగట్టారు. ఈ నేపథ్యంలోనే భరత్‌కుమార్ పేరిట ఆ భూముల కొనుగోలుకు గల కారణాలపై శివబాలకృష్ణను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. శివబాలకృష్ణతో పాటు కుటుంబ సభ్యుల బ్యాంకు లాకర్లను తెరవడంపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. మరికొంత మంది స్థిరాస్తి వ్యాపారులను కూడా ఏసీబీ విచారించనున్నట్టు సమాచారం.
బాలకృష్ణకు జ్యూడిషియల్ రిమాండ్ - ఏసీబీ సోదాల్లో రూ.100 కోట్లకుపైగా ఆస్తులు
గొర్రెల నిధుల గోల్‌మాల్‌పై ఏసీబీ లోతైన దర్యాప్తు - 2 కోట్ల నిధులకు పైగా దారి మళ్లినట్లు గుర్తింపు