Abhaya Hastam Funds:ఐదేళ్ల పాలనలో ఏ వర్గాన్నీ వదలకుండా దోచుకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏళ్ల తరబడి డ్వాక్రా మహిళలు రూపాయి, రూపాయి కూడబెట్టుకున్న అభయహస్తం నిధులనూ వదల్లేదు. 2021లో ఎల్ఐసీ వద్ద ఉన్న 2వేల 100 కోట్లను లాగేసుకున్నారు. ఆ నిధులు ఏం చేశారో?, ఎక్కడికి మళ్లించారో? ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఇదే కాదుడ్వాక్రా మహిళల జీవనోపాధి కల్పనకు రుణాలిస్తామని చెప్పి బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో తెచ్చిన వెయ్యి కోట్ల రూపాయల స్త్రీనిధి లెక్క కూడా తేలలేదు. ఈ రెండు వ్యవహారాల్లో అప్పటి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సీఈఓ ఇంతియాజ్ కీలకంగా వ్యవహరించారు. ఆయన కర్నూలు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఈ వ్యవహారాలపై విచారణ జరిపిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశముంది.
ఏడు భవనాలు, మూడు ఇళ్లు, 12 పడక గదులు- 'నిరుపేద జగన్ నివాసానికి అనుకూలమట' - Jagan Rushikonda Palace
అక్కచెల్లెమ్మలు కూడబెట్టిన నిధి ఎక్కడ జగన్?- ఆ నిధులు ఏం చేశారో?, ఎక్కడికి మళ్లించారో? (ETV Bharat) డ్వాక్రా సంఘాల్లోని 18 నుంచి 60 ఏళ్ల మధ్య మహిళలకు 2009లో అభయ హస్తం పథకాన్ని అమలు చేశారు. ఏడాదికి సభ్యులు వారి వాటాగా 365 రూపాయలు చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం వారి తరఫున మరో 365 రూపాయలు జమచేస్తుంది. వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు 500 రూపాయల చొప్పున పింఛను ఇస్తారు. 2013-14 తర్వాత ఇందులో నమోదు నిలిపేశారు. ప్రస్తుతం ఏపీలో 9 లక్షల మంది వాటాదారులు ఉన్నారు. లబ్ధిదారులు, ప్రభుత్వ వాటా కలిపి 2021 నాటికి దాదాపుగా 2వేల 100 కోట్లకు చేరింది. ఈ మొత్తంపై కన్నేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా ఉన్న ఎల్‌ఐసీని తప్పించి తామే అమలుచేస్తామంటూ ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంది. ఎల్ఐసీ నుంచి తీసుకున్న 2వేల 100 కోట్లను సెర్ప్ పరిధిలోనే ప్రత్యేక ఖాతాలో ఉంచినట్టు అప్పట్లో ప్రభుత్వం నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ ఈ పథకం నుంచి వైదొలగిన వారికి వాళ్ల వాటా మొత్తాన్ని తిరిగివ్వాలి. ఇది దాదాపుగా 320 కోట్ల వరకు ఉంది. ఏ ఒక్కరికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరిగి చెల్లించలేదు. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదు.
పోలవరం పరిస్థితి ఏంటి?- నేడు ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు - CM Chandrababu Visit to Polavaram
జీవనోపాధి కల్పనకు డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడమే స్త్రీనిధి సంస్థ విధి. ఇందుకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి అప్పు తీసుకుని వారికి అంతకంటే ఎక్కువ వడ్డీకి రుణాలిస్తుంది. తీసుకున్న మొత్తాన్ని డ్వాక్రా మహిళలు నెలవారీ వాయిదాలుగా చెల్లిస్తారు. వచ్చిన మొత్తాన్ని ఇతరులకు రుణంగా ఇస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇలా డ్వాక్రా మహిళలకు రుణం ఇప్పించేందుకంటూ స్త్రీనిధి సంస్థలోని ఓ కీలక అధికారి బ్యాంకుల నుంచి వెయ్యి కోట్లు అప్పుగా తెచ్చారు. ఆ మొత్తాన్ని వారికి ఇవ్వకుండా మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధిగా మండల సమాఖ్యల్లో ఏళ్లుగా నిల్వ ఉన్న 100 కోట్లు కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ నిధుల్నీ దుర్వినియోగం చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై కొత్త ప్రభుత్వం విచారణ చేయిస్తే మరిన్ని నిజాలు బయటపడే అవకాశముంది.