Police Case on Hero Raj Tharun : సినీ నటుడు రాజ్‌తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్‌తరుణ్, తాను 2012 నుంచి రిలేషన్లో ఉన్నామని, ఇటీవల అతడు మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్‌తో సన్నిహితంగా ఉన్నట్లు తెలిసిందని పేర్కొంది. 'తిరగబడండ్రా సామి' అనే సినిమా షూటింగ్ జరిగినప్పటి నుంచి ఈ రిలేషన్ కొనసాగిస్తున్నట్లు తేలిందన్నారు. ఇదే విషయమై రాజ్‌తరుణ్‌ను నిలదీస్తే, తనను దుర్భాషలాడాడని ఫిర్యాదులో పేర్కొంది.
'రాజ్‌తరుణ్ నన్ను ప్రేమించి మోసం చేశాడు' - పోలీసులకు ప్రేయసి ఫిర్యాదు - Case on Hero Raj Tharun - CASE ON HERO RAJ THARUN
A Case Registered Against Hero Raj Tharun : సినీనటుడు రాజ్‌తరుణ్‌పై నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 5, 2024, 3:38 PM IST
మాల్వి తండ్రి, సోదరుడు రాజ్‌తరుణ్‌ను వదిలేయాలని తనను బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. సంబంధం లేని కేసులో తనను ఇరికించారని, దాంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని తెలిపింది. కాగా లావణ్య ఇచ్చిన ఫిర్యాదును నార్సింగి పోలీసులు స్వీకరించారు. ఈ విషయంపై ఇన్స్పెక్టర్ హరికృష్ట రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజ్‌తరుణ్ తనను మోసం చేసి, మరో యువతితో సహజీవనం చేస్తున్నాడని లావణ్య ఫిర్యాదు చేశారన్నారు. తనపై బెదిరింపులకు దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై ఆధారాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఫిర్యాదు చేసిన లావణ్య గతంలో ఓ డ్రగ్స్ కేసులో నిందితురాలుగా ఉన్నట్లు వెల్లడించారు.
గోవా నుంచి తెచ్చి హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయం - రాజ్‌తరుణ్ ప్రేయసి అరెస్ట్