తెలంగాణ

telangana

ETV Bharat / state

'అదంతా నిజమని నమ్మా - ప్రేమించి మోసపోయా' - 6 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య - young woman committed suicide - YOUNG WOMAN COMMITTED SUICIDE

Young Woman Committed Suicide : ప్రియుడు తనతో వివాహానికి నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు సాయిగౌడ్​ను అరెస్ట్ చేశారు.

Young Woman Committed Suicide In Nlbnagar
Young Woman Committed Suicide In Nlbnagar (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 30, 2024, 4:35 PM IST

Young Woman Committed Suicide In Jeedimetla :తనను ప్రేమించాలని యువతి వెంటపడ్డాడు ఆ యువకుడు. కాదంటే ఆత్మహత్యే శరణ్యమని నమ్మించాడు. తీరా నమ్మి ప్రేమిస్తే, పెళ్లి చేసుకోనంటూ ముఖం చాటేశాడు. దీంతో ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో జరిగింది.

బాధితురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం, కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎల్బీనగర్​లో నివాసముండే అఖిల(22) ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసేది. షాపూర్​నగర్​కు చెందిన అఖిల్ సాయిగౌడ్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో అఖిలను వేధించేవాడు. తన ప్రేమను అంగీకరించాలంటూ ఆమె వెంటపడ్డాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యలకు తెలియడంతో బంధువుల సమక్షంలో అఖిల్ సాయిగౌడ్​ను పిలిపించి మాట్లాడారు. వివాహం చేసుకుంటానని హామీ ఇవ్వడంతో అతని ప్రేమను అంగీకరించారు. ఏడేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.

గత మూడు, నాలుగు నెలల నుంచి అఖిలపై వేధింపులు ఎక్కువయ్యాయి. చిన్నచిన్న విషయాలకు రోడ్డుపైనే దుర్బాషలాడుతూ కొడుతుండేవాడు. దీనికితోడు అతను పెళ్లికి నిరాకరించడంతో తన కుమార్తె మంగళవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు బాధితురాలి తండ్రి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కంప్లైంట్​ ఇచ్చిన 24 గంటల్లో నిందితుడు సాయిగౌడ్​ను అరెస్టు చేశారు.

Lovers Suicide in Nalgonda : మరోవైపు నల్గొండ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ పరిధిలో రైలు కిందపడి ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం దుర్గానగర్​ కాలనీకి చెందిన ధనలక్ష్మి(24)కి గతంలోనే వివాహం కాగా, ఇద్దరు పిల్లలున్నారు. అదే కాలనీకి చెందిన దుర్గాప్రసాద్(20) సీసీ కెమెరాలు అమర్చే పని చేస్తున్నారు. వీరిరువురు గత కొంతకాలంగా ప్రేమాయణం కొనసాగిస్తున్నారు.

తమ మధ్య ఉన్న అనైతిక సంబంధం సమాజం హర్షించదని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే మిర్యాలగూడ, కుక్కడం రైల్వే స్టేషన్ల మధ్య ఐలాపురం వద్ద గూడ్స్ ట్రైన్​ కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

స్నేహితులకు వాట్సాప్​లో చనిపోతున్నట్లు యువకుడు స్టేటస్​ - రైలుకు ఎదురెళ్లి మరీ ఆత్మహత్య - Lover suicide falling down train

ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం - ప్రేమ పెళ్లిగా మారేలోపు యువకుడు ఆత్మహత్య- ఏమైందంటే? - Young Man Suicide due to Love

ABOUT THE AUTHOR

...view details