PLASTIC FREE MOMENT IN TIRUPATHI: ప్లాస్టిక్‌ను నివారించాలి, ప్లాస్టిక్‌ను తగ్గించాలనే పదాలు పత్రికల్లోనూ, టీవీలోనూ మనకు తరచూ వినిపిసూనే ఉంటాయి. కానీ దాన్ని మనం చాలా సులువుగా ఓ చెవితో విని మరో చెవితో వదిలేస్తాం. కానీ దానివలన ఉద్భవించబోయే విపత్తులను మనం అంచనా వేయం. ఇటీవల భారతదేశంలో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని కేంద్ర వైద్యారోగ్య శాఖ ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. ఇటువంటి భయానక వ్యాధులన్నీ కేవలం ప్లాస్టిక్ వలనే అని ఓ యువకుడు గ్రహించి ఈ తీవ్రమైన సమస్యపై ప్రజల్లో అవగాహనను కల్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు. ఆ విషయాలేంటో ఆయన మాటల్లో విందాం.
Special Story On Plastic: కడప ప్రాంతానికి చెందిన శివాజీ అనే యువకుడు ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో ఉద్యోగాన్ని నిర్వర్తించేవాడు. కానీ అవేవీ అతనికి ఆనందాన్ని ఇవ్వలేకపోయాయి. దాంతో తన ఉద్యోగానికి స్వస్తి చెప్పి సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. సమాజంలో పడకేసిన పారిశుద్ధ్యాన్ని అతను కూలంకుశంగా అధ్యయనం చేశాడు. దీన్ని ఎలాగైనా తగ్గించాలని ప్రణాళికా బద్ధంగా కార్యాచరణను రూపొందించుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలలన్నీ పర్యటించి ప్లాస్టిక్ వాడకంపై అక్కడి స్థితిగతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. వీటితో పాటు ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుపతిలో కుప్పలు తెప్పలుగా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను గమనించాడు. తన వంతుగా విద్యార్థులు, సేవా సంస్థలతో కలిసి ఓ గొప్ప మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. మరి అతని మనోగతమేంటో ఆయన మాటల్లో విందాం.