Threatening Call to Father Saying Daughter has been Kidnapped : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,365 గ్రూప్-3 సర్వీసుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలు ఆదివారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలి రోజున ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 ఎగ్జామ్స్ నిర్వహించారు. మొత్తం 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్-1 పరీక్షకు 2,73,847 మంది, పేపర్-2 పరీక్షకు 2,72,173 మంది హాజరయ్యారు. మొత్తం ఈ పరీక్షలకు 50.7 శాతం హాజరు నమోదైందని టీజీపీఎస్సీ తెలిపింది. ఈరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-3 పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షతో గ్రూప్-3 పరీక్షలు పూర్తవుతాయి.
పరీక్ష రాస్తున్న కుమార్తె - కిడ్నాప్ చేశామంటూ ఫోన్ కాల్ : ఇదిలా ఉండగా, ఎగ్జామ్ సెంటర్లో కుమార్తె గ్రూప్-3 పరీక్ష రాస్తుండగా, 'మీ బిడ్డను కిడ్నాప్ చేశాం. రూ.20 వేలు పంపిస్తే వదిలిపెడతాం' అంటూ ఆగంతకుల నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో ఆ తండ్రి అవాక్కయ్యాడు. కాసేపటి ముందే సోదరుడు కుమార్తెను పరీక్ష కేంద్రం వద్ద దింపి రాగా, ఇంతలోనే కిడ్నాప్‌నకు గురైందా అని కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. మహబూబాబాద్‌లో గురువారం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.