Telangana Activists Atmiya Sammelan in Minister Ponnam Residency :తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో పోరాడిన ఎంపీలు అంతా ఇవాళ హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తయిన సందర్భంగా అందరూ కలసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అందుబాటులో ఉన్న నాయకులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మాజీ ఎంపీలు ప్రస్తుత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్ వెంకట్ స్వామి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజయ్య, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, సురేశ్ షెట్కర్ తదితరులు పాల్గొన్నారు. బలరామ్ నాయక్, సర్వేసత్యనారాయణ, విజయశాంతి, కె. కేశవ్‌రావు తదితరులు అందుబాటులో లేకపోవడంతో ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనలేదని తెలిసింది.
Minister Ponnam Telangana Activists Meet : ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉద్యమ సమయంలో పార్లమెంటులో ఏవిధంగా పోరాటం సాగించారన్న విషయాలపై స్మరించుకున్నారు. అప్పట్లో సమైఖ్య ఎంపీలు నుంచి ఏవిధంగా దూరంగా ఉండాల్సి వచ్చింది.
తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు తామంతా ఏమి చేశాం. అక్కడ చోటు చేసుకున్న అనేక పరిణామాలను ఇవాళ్టి కలయికలో గుర్తు చేసుకోవడం, అభిప్రాయాలను పంచుకోవడం లాంటివి జరిగినట్లు సమాచారం. ఆ తరువాత పొన్నం ప్రభాకర్ నివాసంలోనే నాయకులు అంతా మధ్యాహ్నం భోజనం చేశారు.