తెలంగాణ

telangana

ETV Bharat / state

మీరు గురక పెడుతున్నారా - పక్షవాతం పక్కా - ఈ అలవాట్లున్నాయా చెక్ చేసుకోండి! - SNORING TREATMENT IN NIMS HOSPITAL - SNORING TREATMENT IN NIMS HOSPITAL

Treatment For Snoring Problem : గురక ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య. జీవన విధానంలో మార్పులు, కొన్ని అలవాట్ల కారణంగా ఈ సమస్య అధిక మందిని బాధపెడుతుంది. ఈ సమస్యకు చికిత్స చేయడానికి నిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక ల్యాబ్​ను ఏర్పాటు చేస్తున్నారు.

Treatment For Snoring Problem In NIMS
Treatment For Snoring Problem In NIMS (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2024, 2:37 PM IST

Treatment For Snoring Problem In NIMS :జీవనశైలి మార్పులతో పెరుగుతున్న ‘అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా’(ఓఎస్‌ఏ (గురక)) సమస్యకు చికిత్స అందించేందుకు నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)లో ప్రత్యేక ల్యాబ్‌ ఏర్పాటు చేస్తున్నారు. గురక సమస్య బాధితులకు ఈ ల్యాబ్‌లో చికిత్స అందించనున్నారు. ముఖ్యంగా అధిక బరువు, ధూమపానం, మద్యపానం అలవాట్లు, శ్వాస నాళాల్లో అడ్డంకులు ఉంటే స్లీప్‌ అప్నియా(గురక)కు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్ వ్యాప్తంగా 4 వేల 50 శాతం మంది ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు తెలిపారు. కొన్నిసార్లు శ్వాస ఆగిపోయి అకస్మాత్తుగా మెలకువ రావడం, మళ్లీ పడుకున్న కాసేపటికి అదే పరిస్థితి ఎదురవ్వడం వంటి సమస్యల బారిన పడుతుంటారని చెప్పారు. ఫలితంగా మెదడుకు ప్రాణవాయువు అందక పక్షవాతం బారిన పడే ముప్పు ఉంటుందని పేర్కొన్నారు. గురకతో హృదయ స్పందన రేటు కూడా తగ్గుతుందని చెప్పారు. మహిళల కంటే పురుషులు ఎక్కువ శాతం ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, 30 ఏళ్లు దాటిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని వివరించారు.

Snoring remedy : గుర‌క ఎక్కువ‌గా వ‌స్తోందా? ముందుగా ఈ పని చేస్తే అంతా సెట్​!

నిద్రపై అధ్యయం తర్వాతే చికిత్స :గురక బాధితులను 24 గంటలపాటు ల్యాబ్‌లో ఉంచి వారి నిద్రపై అధ్యయనం చేస్తారు. రోగి నిద్రిస్తున్న సమయంలో గుండె, ఊపిరితిత్తులు, మెదడు కార్యకలాపాలు, శ్వాస విధానాలు, చేయి, కాలు కదలికలు, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులను పరిశీలన చేస్తారు. ఈ పరీక్షనే పాలిసోమ్నోగ్రఫీగా వివరిస్తున్నారు. స్లీప్‌ అప్నియాను టైప్‌1, 2, 3 గా విభజించి సమస్యను విశ్లేషించి రోగికి చికిత్స చేస్తారు.

జీవన విధానంలో మార్పులు : ముక్కు, శ్వాసనాళాల్లో అడ్డంకులు ఉంటే శస్త్రచికిత్సతో తొలగిస్తారు. అవసరం లేదనిపిస్తే జీవనశైలిలో మార్పులకు సంబంధించి సూచనలు సలహాలు ఇస్తారు. డ్రింకింగ్, స్మోకింగ్ తగ్గించుకోవడం, రోజూ గంటపాటు నడక, ఈత లాంటి వ్యాయామాలతో బరువు నియంత్రణలోకి రావడమే కాకుండా గురక కూడా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. త్వరలో ఈ ల్యాబ్‌ను ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులతో పోలిస్తే నాలుగోవంతు ఖర్చుతోనే తమ వద్ద చికిత్స చేస్తామని నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప తెలిపారు.

Snoring Remedies : గురక తగ్గాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

Snoring Causes Health Issues : గురక చిన్న సమస్యేం కాదు.. ఆరోగ్యానికి పెను ప్రమాదం!

ABOUT THE AUTHOR

...view details