ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రేమకు అడ్డొస్తున్నాడని బీరు సీసాలతో దాడి చేసి స్నేహితుడి హత్య - నిందితులంతా 20 ఏళ్ల లోపువారే - Friend murder For Girlfriend - FRIEND MURDER FOR GIRLFRIEND

A Friend Who Killed a Friend For His Girlfriend : తన ప్రియురాలితో చనువుగా ఉంటున్నాడని స్నేహితుడినే చంపాడు ఓ యువకుడు. అతి కిరాతకంగా బీర్ బాటిళ్లతో దాడి చేసి, గొంతు నులిమి రైల్వే ట్రాక్​పైన పడేశారు. ఈ ఘటన హైదరాబాద్​లోని కూకట్​పల్లిలో చోటు చేసుకుంది.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 3:41 PM IST

Man Killed By Friends in Kukatpally : ప్రేమకు అడ్డొస్తున్నాడని భావించి స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని రైలుపట్టాలపై పారేసి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశారు. 10 మంది నిందితులను అల్లాపూర్ పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. నిందితులంతా 20 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. వివరాల్లోకెళ్తే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​ కూకట్​పల్లి అల్లాపూర్ డివిజన్​లోని సఫ్దనగర్​కు చెందిన అహ్మద్, అన్వరీ బేగం కుమారుడు డానీష్ ​(17) యూసుఫ్​గూడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చదువుతున్న దివంగత రౌడీషీటర్ కుమారుడితో పాటు మరికొందరితో డానీష్​కు స్నేహం ఉంది. రౌడీషీటర్ కుమారుడు పదో తరగతి ఫెయిల్ కావడంతో మిగితా వారి కంటే విద్యలో ఒక సంవత్సరం వెనకబడి ఉన్నాడు.

అయితే రౌడీషీటర్ కుమారుడికి అదే కాలేజీలో చదువుతున్న అమ్మాయితో బంధుత్వం ఉంది. అదే అమ్మాయితో డానీష్ ఫ్రెండ్లీగా ఉండేవాడు. అది చూసి ఇతను తట్టుకోలేకపోయేవాడు. ఈ విషయంపై డానీష్​కు అతడికి చాలా సార్లు గొడవ కూడా అయింది. నేను పెళ్లి చేసుకునే అమ్మాయితో నువ్వేందుకు తిరుగుతున్నావ్ అంటూ పలుమార్లు ఇతను డానీష్​తో గొడవకు దిగినట్లు సమాచారం. అయితే ఈ నెల 22న రాత్రి 9.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన డానీష్ తిరిగి రాలేదు. మరుసటి రోజు ఉదయం బోరబండ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఛిద్రమైన స్థితిలో డానీష్ మృతదేహం లభ్యమైంది. హత్య కావొచ్చని తల్లిదండ్రులు అల్లాపూర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

భార్యపై అనుమానం - గొడ్డలితో నరికి చంపిన భర్త - husband killed his wife

ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు విచారణ మొదలు పెట్టిన వారికి నివ్వెరపోయే విషయాలు బయటకువచ్చాయి. డానీష్ అడ్డు తొలగించుకోవాలని భావించిన రౌడీషీటర్ కుమారుడు తన స్నేహితులతో కలిసి అతన్ని చంపేందుకు ప్లాన్ చేశాడు. అందులో భాగంగా గత శనివారం రాత్రి డానీష్​కు రౌడీషీటర్ కుమారుడు ఫోన్ ​చేసి బోరబండ రైల్వే పట్టాల దగ్గర ఉన్న పొదల దగ్గరకు రావాలని చెప్పాడు. డానీష్​ అక్కడికి వెళ్లేసరికి రౌడీషీటర్ కుమారుడితో పాటు మరో 8మంది స్నేహితులున్నారు.

గంజాయి తాగి బీర్ సీసాలతో దాడి : అంతా కలిసి కొంతసేపు గంజాయి తాగారు. తర్వాత డానీష్​ను దాడి చేసేందుకు ముందే ఉంచుకున్న ఖాళీ బీరు సీసాలతో స్నేహితులంతా కలిసి తలపై దాడి చేశారు. డానీష్​ గొంతునులిమి ప్రాణాలు తీసినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి ప్రమాదంగా సృష్టిచేందుకు పట్టాలపై వేశారని తెలిపారు. కానీ ఘటన ప్రదేశంలో రౌడీషీటర్ చరవాణి సిగ్నల్ చూపించడం వంటి ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు. ఐదుగురిని కోర్టు హాజరు పరచగా మరో ఐదుగురిని జువైనల్ హోంకు తరలించారు.

విజయవాడలో దారుణం - మందలించాడని వ్యాపారిని హత్య చేసిన యువకుడు - Vijayawada Kirana Shop Owner Murder

ABOUT THE AUTHOR

...view details