7 Years Old Girl Amazing Talent in Skating : స్కేటింగ్‌తో రకరకాల విన్యాసాలు చేస్తూ రికార్డులు సృష్టిస్తోంది ధన్విక అనే ఏడేళ్ల చిన్నారి. పశ్చిమ గోదావరి జిల్లా అలంపురానికి చెందిన ధన్విక అందరిలా చేస్తే గొప్పేముంది అనుకుందో ఏమోకానీ స్కేటింగ్‌లో మల్టీ టాస్కింగ్ ప్రారంభించింది. తలమీద, రెండు చేతులపై కుండలు పెట్టుకుని అందులో నిప్పు వెలిగించుకుని స్కేటింగ్ చేసింది. దానితో పాటు రివర్స్ స్కేటింగ్‌తో చూపరులను అబ్బురపరిచింది. మధ్యలో కర్రసాము చేసింది. బాస్కెట్‌బాల్ ఆడింది. ఒంటిపై ట్యూబ్‌లైట్లు పగలగొట్టించుకుంది. ఇలా తణుకు నుంచి సిద్ధాంతం వరకు 18 కిలోమీటర్లు వివిధ రకాలు విన్యాసాలతో ధన్విక స్కేటింగ్ చేసింది. అంతర్జాతీయ జీనియస్ బుక్, వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది.
ఇలా వివిధ రకాల విన్యాసాలతో వెనక్కి స్కేటింగ్ చేస్తూ కూడా అబ్బురపరిచింది. ధన్విక చేసిన విన్యాసాలను జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు పరిశీలించి తమ పుస్తకాల్లో నమోదు చేశారు.
చిన్న వయస్సులోనే 15స్వర్ణ పతకాలు- జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో బహుముఖ ప్రజ్ఞ - Multi Talented Girl