ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులి పిల్లలనుకున్నారు - అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు! - 4 WILD CAT CUBS FOUND AT ELURU DIST

పులి కూనలు అని ప్రచారం కావడంతో స్థానికంగా కలకలం- కావని తేల్చిన అటవీ శాఖ అధికారులు

four_wild_cat_cubs_found_at_aagiripalli_hanuman_junction_main_road
four_wild_cat_cubs_found_at_aagiripalli_hanuman_junction_main_road (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2025, 9:26 AM IST

Four Wild Cat Cubs Found at Aagiripalli- Hanuman Junction Main Road :ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కృష్ణవరం గ్రామ సమీపంలో ఆగిరిపల్లి - హనుమాన్‌ జంక్షన్‌ ప్రధాన రహదారి పక్కన గురువారం 4 అడవి పిల్లి కూనలు కనిపించాయి. తొలుత అవి పులి కూనలు అని ప్రచారం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. మర్రెడ్డి ఫణీంద్ర అనే రైతు ఉదయం పొలానికి వెళ్లి పొదల్లో ఉన్న కూనలను చూశారు. పులి కూనలుగా భావించి స్థానికులకు తెలిపారు.

దీంతో పెద్దఎత్తున ప్రజలు అక్కడికి వెళ్లి, వాటిని ఫొటోలు తీసి, పులి పిల్లలంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. విషయం తెలిసి అటవీ శాఖ అధికారులు వచ్చి వాటిని అడవి పిల్లి కూనలుగా తేల్చి, స్వాధీనం చేసుకున్నారు. వాటిని తల్లి వద్దకు చేర్చేందుకు ప్రయత్నిస్తామని నూజివీడు ఫారెస్ట్‌ రేంజర్‌ టి.సత్యనారాయణ, ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారిణి ఎల్‌.బాల తెలిపారు.

పులిని పోలిన అడవి పిల్లి కూన (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details