RS. 28.50 lakhs Cyber Fraud In Name of CBI Officer : సీబీఐ అధికారులమంటూ ప్రముఖ పారిశ్రామిక వేత్తకు సైబర్ నేరగాళ్లు రూ.28.50లక్షలు టోకరా వేసిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 2వ తేదీన హనుమకొండకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తకు గుర్తు తెలియని మహిళ ఫోన్ చేసింది. తాను ట్రాయ్ నుంచి మాట్లాడుతున్నానంటూ ' మీ ఆధార్ కార్డు మొబైల్ నంబర్‌కు లింక్ చేయలేదు. రెండు గంటల్లో మీ ఫోన్ నంబర్ బ్లాక్ చేస్తాం, త్వరలో మా ఉన్నతాధికారులు మీతో మాట్లాడుతారు' అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
సెట్టింగ్‌తో నమ్మంచి :కొద్దిసేపటికి మరో మహిళ కాల్ చేసి తాను సీబీఐ ముంబయి బ్రాంచీ అధికారిని అంటూ పరిచయం చేసుకుని వెంటనే కాల్ కట్ చేసి వాట్సాప్ వీడియో కాల్ చేసి సీబీఐ కార్యాలయం మాదిరిగా ఉన్న సెట్టింగ్‌ను చూపించారు. 'మీరు మనీ ల్యాండరింగ్‌లో పాల్గొన్నారు మీపై సీబీఐ కేసు నమోదు చేసింది' అని చెప్పారు. సీబీఐ అధికారులు ఎప్పుడైనా వచ్చి అరెస్టు చేస్తారని భయాందోళనకు గురిచేసింది.
'నాకు క్యాష్ ఇవ్వండి - మీకు ఆన్లైన్ చేస్తా' - ఇలా ఎవరైనా అడిగితే అస్సలు ఇవ్వకండి - ONLINE CHEATING IN HYDERABAD
డిజిటల్ అరెస్ట్ చేసి :నరేష్ గోయల్ అనే వ్యక్తి మీ ద్వారా సుమారు రూ.6.8 కోట్లు మనీ ల్యాండరింగ్ చేశారని, అందుకోసం మీకు రూ.18.16 లక్షల కమీషన్ ఇచ్చారని చెబుతూ తమ వద్ద పూర్తి వివరాలు ఉన్నాయని నమ్మబలికింది. ఈ కేసు నుంచి మీరు తప్పించుకోలేరని బెదిరంచింది. ఒక రకంగా అతన్ని డిజిటల్ అరెస్ట్ చేసింది. ప్రస్తుంత మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు తాము సూచించిన అకౌంట్లలోకి మళ్లించాలని, కేసు విచారణ పూర్తయ్యాక ఎన్వోసీ సర్టిఫికేట్‌తో పాటు డబ్బు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. వారి మాటలకు భయపడిన పారిశ్రామికవేత్త నిజమేననుకొని తనకున్న రెండు ఖాతాల్లోని రూ.28.50 లక్షలు వారు చెప్పిన ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేశారు.
తిరిగి కాల్ చేస్తే స్విచ్చాఫ్ : నగదును బదిలీ చేసి రెండు రోజులవుతున్న అధికారుల నుంచి ఎలాంటి ఫోన్ రాకపోవడంతో అనుమానం వచ్చి తనకు వచ్చిన ఫోన్‌కు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. పారిశ్రామిక వేత్త పోలీసులను ఆశ్రయించగా ఆసలు విషయం బయటకు వచ్చింది. బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోని దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.
సైబర్ నేరాలకు పాల్పడుతున్న కీలక నిందితుల అరెస్ట్ - అకౌంట్లలోని రూ.1.61 కోట్లు సీజ్ - Cyber Fraudsters Arrested
మనోళ్లతోనే మనోళ్లకు టోకరా - చైనా దుండగుల సరికొత్త సైబర్ దండయాత్ర - Chinese Cyber Fraud With Indians