ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బడ్జెట్​ను 'మమ' అనిపించిన వైసీపీ ప్రభుత్వం - అంకెలు ఉన్నాయి రాబడే లేదు - ఏపీ శాసనసభ సమావేశాలు

2024- 25 YCP Govt Budget: ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రవేశపెట్టిన ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ అంకెల్లో అన్నీ మసిపూసి మారేడుకాయ చేశారు. ప్రభుత్వ గొప్పలు చెప్పేందుకు కొన్ని అంకెలు పెంచి చూపారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని చాటుకునేందుకు రెవెన్యూ లోటును తగ్గించి చూపారు. ద్రవ్యలోటు విషయంలోనూ అదే పరిస్థితి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,86,389.27 కోట్ల అంచనా వ్యయంతో బుగ్గన బడ్జెట్‌ సమర్పించినట్లు పీటీఐ వెల్లడించింది. అందులో తొలి నాలుగు నెలలకు 1,08,052.33 కోట్లతో ఆమోదం పొందేందుకు సభ ముందుంచారు. ఏప్రిల్, మే, జూన్, జులై నెలల్లో సాధారణ ప్రభుత్వఖర్చులకు, రెగ్యులర్‌ పథకాలకే ప్రస్తుత శాసనసభ ఆమోదం తెలియజేస్తుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోవాలి.

ycp_budget
ycp_budget

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 9:21 AM IST

బడ్జెట్​ను 'మమ' అనిపించిన వైసీపీ ప్రభుత్వం - అంకెలు ఉన్నాయి రాబడే లేదు

2024- 25 YCP Govt Budget:ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.79 లక్షల కోట్లు ఉన్న బడ్జెట్‌ అంచనాలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా పెంచుతూ మొత్తం 2లక్షల 86వేల389.27 కోట్లతో పద్దును బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టినట్లు పీటీఐ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ పరిస్థితులను మించి అంచనాలు సమర్పించడం, దానికి తగ్గట్టుగా ఆర్థిక గణాంకాలు లేకపోవడంతో అంచనాల్లో పెద్దగా మార్పులు లేకుండానే బడ్జెట్‌ను మమ అనిపించారు. నిజానికి ఈ స్థాయిలో బడ్జెట్‌ అమలుచేయాలన్నా అందుకు తగ్గ రాబడి సాధించడం అంత సులభం కాదు. ప్రస్తుత సంవత్సరంలో ఉన్న లెక్కలకు, వచ్చే ఏడాది అంచనాలకు మధ్య ఎక్కడా సంబంధం లేదు.

ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,05,352.18 కోట్ల రెవెన్యూ రాబడులు వస్తాయని ఆర్థికమంత్రి అంచనా వేశారు. ఆ స్థాయి రాబడి సాధించే మార్గాలు ఏంటనేది చర్చనీయాంశమవుతోంది. పీటీఐ వెల్లడించిన వివరాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి రెవెన్యూ రాబడి అంచనాలను పెంచేశారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వాస్తవంగా వచ్చిన రెవెన్యూ రాబడి సుమారు 1.57 లక్షల కోట్లే. అలాంటిది కిందటి ఏడాది బడ్జెట్‌ అంచనాల్లో ఆయన 2.06 లక్షల కోట్ల రెవెన్యూ రాబడిని అంచనా వేసి బడ్జెట్‌ రూపొందించారు. తొలి పది నెలల్లో కాగ్‌కు సర్కార్‌ సమర్పించిన లెక్కల ప్రకారం వచ్చిన రాబడి 1.19 లక్షల కోట్లే! జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో కలిపి మూడు నెలల్లోనే సుమారు మరో 77వేల కోట్ల రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.

సకుటుంబ స'మేత' పర్వం - దోపిడీలో పతిని మించిన సతి, ఇసుక మేస్తున్న పుత్రరత్నం

ఆ మేరకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడి 1.96 లక్షల కోట్లకు పైగా వస్తుందని అంచనాలు సవరించారు. అలాంటిది తాజా బడ్జెట్‌లో రెవెన్యూ రాబడులు ఏకంగా 2.05 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేశారు. కాని వాస్తవానికి వస్తే ఇంత వచ్చే పరిస్థితి లేదని పాత గణాంకాలను చూస్తే తెలుస్తుంది. 2022-23 బడ్జెట్‌లో ఆర్థికమంత్రి బుగ్గన 1.91 లక్షల కోట్ల రాబడి వస్తుందన్నారు. తర్వాత అంచనాలను సవరిస్తూ 1.76 లక్షల కోట్లు వచ్చిందని ఆ ఏడాది పూర్తయ్యేముందు చెప్పారు. చివరికి లెక్కలన్నీచూస్తే వచ్చిన రాబడి 1.57 లక్షల కోట్లే! ఇలాంటి పరిస్థితుల్లో రెండేళ్లలో రెవెన్యూ రాబడి 30% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో రెవెన్యూ లోటు పెరిగిపోతోంది. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ ఖర్చులు నిరంతరం పెరుగుతున్నాయి. రెవెన్యూ లోటును నియంత్రిస్తున్నామని చెబుతున్నా ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలకూ కార్పొరేషన్ల ద్వారా కొన్ని రుణాలు తీసుకొస్తున్నారు. ఆ కార్పొరేషన్ల ద్వారానే పథకాలు అమలుచేసి, ఖర్చులనూ అక్కడే చూపించడం, పబ్లిక్‌ డిపాజిట్‌ ఎకౌంట్ల నిర్వహణ వాటి వినియోగ తీరు వల్ల కూడా రెవెన్యూ లోటు తగ్గించి చూపుతున్నారు. రెవెన్యూ లోటు తగ్గిస్తామని ఆర్థికమంత్రి ప్రతి బడ్జెట్‌లోనూ చెబుతున్నా అది అంచనాలు మించిపోతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 24,758.22 కోట్లకే రెవెన్యూ లోటును పరిమితం చేస్తామని పేర్కొన్నారు.

మితిమీరిన వైఎస్సార్సీపీ అరాచకం- టీడీపీ సానుభూతిపరుడిపై హత్యాయత్నం

గత ఆర్థిక సంవత్సరంలో 22,316.70 కోట్ల మేర మాత్రమే రెవెన్యూ లోటు ఉంటుందన్నారు. పది నెలల్లోనే అది 49,996 కోట్లు ఉన్నట్లు కాగ్‌ లెక్కలు పేర్కొంటున్నాయి. సవరించిన అంచనాల్లో దాన్ని 31,534.93 కోట్లకే పరిమితం చేస్తామని లెక్కలు చూపించారు. 2022-23 అంచనాలు, సవరించిన అంచనాలు, వాస్తవ లెక్కల మధ్య తేడా చూస్తే రెవెన్యూ లోటుకు ఎలా మసి పూస్తున్నారో అర్థమవుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం వాస్తవ లెక్కలను ఆర్థికమంత్రి బుగ్గన బుధవారం సమర్పించారు.

2022-23లో రెవెన్యూ లోటు అంచనా 17,036.15 కోట్లుగా నాడు ప్రతిపాదించారు. ఆ సంవత్సరం గడిచిన తర్వాత 29,107.56 కోట్లకే పరిమితం చేసుకున్నామని చెప్పారు. వాస్తవ లెక్కలు తేలేసరికి అది 43,487.49 కోట్లకు పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటును 24,758.22 కోట్లకే పరిమితం చేస్తామని చెబుతున్నారు. ద్రవ్యలోటు విషయంలోనూ అదే పరిస్థితి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60,153.58 కోట్ల ద్రవ్యలోటు చూపుతున్నారు. అలాంటిది వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 55,817.50 కోట్లకే పరిమితం చేస్తామని ఆర్థికమంత్రి తన బడ్జెట్‌ అంచనాల్లో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details