తెలంగాణ

telangana

ETV Bharat / state

మీ బస్తీలో ఉన్న డాక్టర్ నకిలీ కావొచ్చు! - ఫీజు తక్కువని నాడి చూపిస్తే ప్రాణాలు గాల్లోకి!! - FAKE DOCTORS IN HYDERABAD

నకిలీ వైద్యులకు అడ్డాగా హైదరాబాద్ - తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో 100 మంది నకిలీ వైద్యుల గుట్టురట్టు

100 Fake Doctors Identified
Fake Doctors In Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2024, 11:02 AM IST

Fake Doctors In Hyderabad : హైదరాబాద్ నకిలీ వైద్యులకు అడ్డాగా మారుతోంది. డబ్బు కోసం ప్రాణాలతో చెలమాడుతున్నారు కొందరు నకిలీగాళ్లు. అర్హత లేకున్నా, నాడి పట్టి రోగుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఏదైనా రోగం వస్తే వైద్యుడు నయం చేస్తాడని రోగుల నమ్మకం. కానీ డబ్బులకు ఆశపడి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఇప్పటి వరకు 100 మంది నకిలీ వైద్యుల గుట్టు బయటపడింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో ఎలాంటి ఎంబీబీఎస్ కానీ, ఇతర వైద్య పట్టాలు కానీ లేకుండానే ప్రాక్టీసు చేస్తున్నట్లు గుర్తించారు.

  • డెంటల్‌ డిగ్రీ పొందిన ఓ వైద్యురాలు నాగోలులో ఎస్‌జేఎం పేరుతో క్లినిక్‌ తెరిచింది. దీంతో ఏకంగా చర్మ వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. డెర్మటాలజిస్టులు చేయాల్సిన కాస్మటాలజీ వైద్యం, హెయిర్‌ ట్రాన్స్‌పాంట్‌ ఈమె చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో గుర్తించారు.
  • శ్రీసాయి క్లినిక్‌ పేరుతో ఓ నకిలీ వైద్యుడు తిరుమలగిరిలో ప్రాక్టీసు చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన రోగులకు ఐవీ ఫ్లూయిడ్స్, యాంటిబయోటిక్‌ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
  • ఓ వ్యక్తి విదేశాల్లో ఎంబీబీఎస్‌కి సమానమైన వైద్య విద్యను అభ్యసించాడు. దీంతో ఏకంగా ఎండీ బోర్డు పెట్టి, చర్మ వ్యాధి నిపుణుడిగా హైదరాబాద్​లో చలామణి అవుతున్నాడు.

కాస్త అనుభవంతో : వైద్యులుగా చెలామణి అవుతున్న ఈ నకిలీ డాక్టర్ల వద్ద సరైన పట్టాలు ఉండవు. కొంతమంది నకిలీ పట్టాలు సృష్టించి క్లినిక్‌లు నడపుతున్నారు. కొంతమంది ఏవో గుర్తింపు లేని యూనివర్సిటీల నుంచి పట్టాలు కొనుక్కొని డాక్టర్లుగా ఆస్పత్రులే పెడుతున్నారు. మెడికల్‌ షాపులు కూడా పెట్టించి అనుమతులు లేకుండా మందులను అమ్ముతున్నారు.

దాదాపు 140 వరకు ఇలాంటి షాపులను ఔషధ నియంత్రణ శాఖ గుర్తించింది. హోల్‌సేల్‌ డీలర్లు కూడా ఇలాంటి క్లినిక్‌లకు మందులను సరఫరా చేస్తూ ఉన్నారు. బస్తీలు, మురికి వాడలను లక్ష్యంగా చేసుకొని క్లినిక్‌లు పెడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కన్సల్టెంట్‌ ఫీజులు రూ.500 నుంచి రూ.1500 వరకు ఉండటం, ఈ నకిలీ వైద్యులు రూ.50, రూ.100 వసూలు చేస్తుండటంతో పేదలు ఎక్కువ మంది వీరి దగ్గరకు వెళ్తున్నారు.

అధిక మోతాదుతో కూడిన మందులు : కొందరు నకిలీ డాక్టర్లు క్లినిక్​కు వెళ్లిన రోగులకు అవగాహన లేక అధిక మోతాదుతో కూడిన మందులను ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా హై యాంటీ బయోటిక్స్‌తో అప్పటికప్పుడు రోగం నయం అనిపిస్తుంది. కానీ కొన్నిరోజుల తర్వాత తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కీళ్ల నొప్పులు, ఇతర సమస్యలకు స్టెరాయిడ్లు ఇస్తున్నారని గుర్తించారు.

"చట్ట ప్రకారం అర్హత లేని వ్యక్తులు క్లినిక్‌లు తెరవడం, ప్రాక్టీసు చేయడం నేరం. ఎన్‌ఎంసీ చట్టం 34, 35 ప్రకారం వీరిపై కేసు నమోదు చేస్తారు. టీజీఎంసీ ఆధ్వర్యంలో నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో 30 బృందాలు తనిఖీలు చేస్తున్నారు. నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి".- డాక్టర్‌ జి.శ్రీనివాస్‌, నీట్రీజీఎంసీ వైస్‌ ఛైర్మన్‌

ఫేక్ డిగ్రీలతో ట్రీట్​మెంట్ చేస్తున్నారు! - ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి

హైదరాబాద్​లో స్ట్రీట్​కో శంకర్​దాదా ఎంబీబీఎస్ - ఈ ఫేక్ డాక్టర్లతో జాగ్రత్త సుమీ!! - FAKE DOCTORS IN HYDERABAD

ABOUT THE AUTHOR

...view details