Yuzvendra Chahal Wife : టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె, తనకు అస్సులు సంబంధం లేని వీడియో కారణంగా ట్రోలింగ్‌కు గురవడానికి కారణమేంటో తెలుసుకుందాం.
కొరియోగ్రాఫర్ సుర్భీ చందన ఇటీవలే పెళ్లి చేసుకుని కరణ్ ఆర్ శర్మతో కలిసి గడుపుతున్న మూమెంట్స్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఒక స్విమ్మింగ్ పూల్‌లో నిలబడి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సుర్బీ చందన వీడియో వైరల్ అవడానికి చాహల్ భార్య ధనశ్రీ వర్మను ట్రోలింగ్ చేయడానికి వెనక పెద్ద కథే ఉంది.
చాలా మంది సోషల్ మీడియా యూజర్లు సుర్బీ చందనను చూసి చాహల్ భార్య ధనశ్రీవర్మ అనుకున్నారు. 'భర్తతో కాకుండా వేరే వ్యక్తితో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్నావా?' అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. కొద్ది వారాల క్రితం కొరియోగ్రాఫర్ అయిన ప్రతీక్ ఉటేకర్‌తో కలిసి దిగిన ఫొటో కూడా అంతే వైరల్ అయి ట్రోలింగ్‌కు గురైంది. ఆ ఫొటోను వెంటనే డిలీట్ చేసింది ధనశ్రీ.
ఆ సందర్భంలోనే, "నేను నార్మల్‌గా ట్రోల్స్‌ను పట్టించుకోను. కాకపోతే అవి హద్దుమీరి నా కుటుంబ సభ్యులను, నా సన్నిహితులను ప్రభావితం చేస్తున్నాయి. ఇతరుల వ్యక్తిగత, మనోభావాలను సైతం పట్టించుకోకుండా విమర్శించే హక్కు మీకెక్కడిది? విద్వేషాన్ని వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకున్నారా" అని అంటూ నెటిజన్లను నిలదీసింది ధనశ్రీ.