తెలంగాణ

telangana

ETV Bharat / sports

రిచా తుపాన్ ఇన్నింగ్స్​- అయినా ఓడిన ఆర్సీబీ- ' స్టార్' అంటూ సూర్య ప్రశంస

WPL 2024 RCB Richa Ghosh: డబ్ల్యూపీఎల్​లో భాగంగా ఆదివారం దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓటమిపాలైంది. దీంతో మైదానంలో రిచా ఘోష్ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఈ మ్యాచ్​లో రిచా ఇన్నింగ్స్​కు గాను ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

WPL 2024 RCB Richa Ghosh
WPL 2024 RCB Richa Ghosh

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 10:27 AM IST

Updated : Mar 11, 2024, 10:58 AM IST

WPL 2024 RCB Richa Ghosh: 2024 డబ్ల్యూపీఎల్​లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై దిల్లీ క్యాపిటల్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్​లో ఆర్సీబీ గెలవడానికి చివరి బంతికి రెండు పరుగుల అవసరమైన సమయంలో రిచా ఘోష్ రనౌట్ కావటం వల్ల ఆర్సీబీ ఓటిమిని చవిచూసింది. అయితే ఈ మ్యాచ్​లో ఆర్సీబీ ఓడినప్పటికీ ఆ జట్టు బ్యాటర్ రిచా ఘోష్ ఆట మాత్రం అందరిని ఆకట్టుకుంది.

ఇక ఆఖరి వరకు పోరాడిన రిచా 29 బంతుల్లోనే 51 పరుగులు చేసింది. అయినప్పటికీ జట్టు ఓడడం వల్ల మైదానంలోనే రిచా కన్నీరు పెట్టుకుంది. మ్యాచ్ ఫలితం ఏదైనప్పటికీ అద్భుతంగా ఆడావంటూ నెటిజన్లు రిచాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమ్​ఇండియా స్టార్​ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా రిచాను మెచ్చుకున్నాడు. 'యూ ఆర్​ ఏ స్టార్' అంటూ ఇన్​స్టాగ్రామ్​ స్టోరీ షేర్ చేశాడు.​

సూర్య కుమార్ యాదవ్ పోస్ట్

మ్యాచ్ విషయానికొస్తే :తొలుత బ్యాంటిగ్​ చేసిన దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల కొల్పొయి 181 పరుగులు చేసింది. అనంతరం 182 పరుగుల లక్ష్యంతో ఆర్సీబీ బరిలోకి దిగింది. ప్రారంభంలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్​లోనే కెప్టెన్ స్మృతి మంధాన(5) పెవిలియన్​కు చేరింది. ఎలీస్ పెర్రీ, సోఫీ మోలినూ(30) కలిసి రెండో వికెట్​ పడే సమయానికి 89 పరుగులు చేశారు. స్వల్ప వ్యవధిలోనే ఇద్దురు ఔట్​ అయ్యారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రిచా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడింది. సోఫీ డివైన్​తో కలిసి మంచి ఇన్నింగ్​ను ఇచ్చింది. అయితే డివైన్ ఔట్​ కావటం వల్ల ఆర్సీబీకి గట్టి దెబ్బ తగిలింది.

ఒక్క పరుగు తేడాతో ఓటమి
ఇక ఆఖరి ఓవర్లో ఆర్సీబీకి 17 పరుగులు కావాలి. తొలి బంతికి రిచా సిక్స్​ను బాదింది. ఆర్సీబీలో మళ్లీ ఆశలు చిగురించాయి. కానీ తర్వాతి 3 బంతులకు 2 పరుగులే వచ్చాయి. అయిదో బంతికి రిచా మళ్లీ సిక్స్‌ బాదింది. దీంతో ఆర్సీబీ చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి వచ్చింది. అర్ధసెంచరీ చేసిన రిచా జోరు మీద ఉండడంతో ఆ జట్టు గెలిస్తుందని అందరూ భావించారు. కానీ ఆఖరి బంతికి రిచా సరిగా షాట్‌ కొట్టలే పరుగు తీసే క్రమంలో రనౌట్‌ కావడం వల్ల ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. దీంతో మైదానంలో రిచా కన్నీళ్లు పెట్టుకుంది. అక్కడే ఉన్న దిల్లీ క్రికెటర్లు వచ్చి రిచాను ఓదర్చారు.

అదరగొట్టిన సాత్విక్‌, చిరాగ్‌ జోడీ - రెండో సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం

వారెవ్వా 'హర్మన్'- WPL హిస్టరిలోనే భారీ ఛేజింగ్- మ్యాచ్​లో నమోదైన రికార్డులు

Last Updated : Mar 11, 2024, 10:58 AM IST

ABOUT THE AUTHOR

...view details