Virat Kohli RCB : ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా శనివారం (మే 4)ను గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరులో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. మ్యాచ్‌లో చాలా దూకుడుగా ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ షారుక్ ఖాన్‌కు ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చుక్కలు చూపించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే ?
గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్‌లోని 13 ఓవర్‌ను ఆర్సీబీ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేస్తున్నాడు. ఈ ఓవర్లోని నాల్గవ బంతికి క్రీజులో ఉన్న రాహుల్ తెవాటియా బ్యాటింగ్ చేశాడు. తనకు వచ్చిన బంతిని కోహ్లీ వైపు బాల్ స్ట్రైట్‌గా కొట్టాడు. అయితే నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో నిలబడి పరుగులు తీసేందుకు ప్రయత్నించిన షారుక్ ఖాన్, పిచ్ సగ భాగానికి చేరుకున్నాడు.
అయితే అప్పటికే బంతి విరాట్ కోహ్లీ చేతిలోకి వెళ్లింది. ఇక అతడి చేతిలోని బాల్‌ను చూసి షారుక్ వెనక్కి పరుగు తీశాడు. కానీ ఈ లోపే కోహ్లీ తన టైమింగ్‌తో ఆ బంతిని నేరుగా వికెట్ల వైపుకు విసిరాడు. దీంతో షారూక్ ఖాన్ రనౌటయ్యాడు. ఇక షారుక్ ఔటవ్వగానే కోహ్లీ ప్లయింగ్ కిస్‌లు ఇస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియె నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. కోహ్లీ ఔట్ చేసిన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఈ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇది నాలుగో విజయం. చిన్నస్వామి వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడ్డ పోరులో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో నెగ్గింది. గుజరాత్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ (64 పరుగులు, 23 బంతుల్లో; 10x4, 3x6) మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. దినేశ్ కార్తిక్ (21*) రాణించాడు.
148 పరుగుల ఛేదనలో ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (42), ఫాఫ్ డూప్లెసిస్ (64) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. డూప్లెసిస్ మాత్రం గుజరాత్ బౌలర్లపై దండయాత్ర చేశాడు. ఈ క్రమంలో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆరో ఓవర్లో సిక్స్, ఫోర్ బాది తర్వాత బంతికి జోషువా బౌలింగ్‌లో క్యాచౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 92 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అలాగే పవర్ ప్లే లోనే 92 పరుగుల స్కోర్ నమోదైంది.
విరాట్ ముంగిట మరో రికార్డ్- ఏకైక ప్లేయర్‌గా నిలిచే ఛాన్స్! - IPL 2024
'వరల్డ్‌కప్‌కు సిరాజ్ వద్దు, పేసర్‌గా అతడే బెటర్'- మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - T20 World Cup 2024