Virat Kohli Ipl Runs:రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ శనివారం రాజస్థాన్‌తో మ్యాచ్‌లో పలు రికార్డ్‌లు సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు (8) బాదిన ఘనతతోపాటు, 7500+ పరుగులు నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డ్ సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ (113 పరుగులు, 72 బంతుల్లో ; 12x4, 4x6) సెంచరీ ఇన్నింగ్స్‌తో ఈ మైలురాళ్లు అందుకున్నాడు. కాగా, 2024 ఐపీఎల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.
ఐపీఎల్లో ఇప్పటివరకూ 242 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 130.36 స్ట్రైక్ రేట్‌తో 7575 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా ఒకే సీజన్ (2016)లో 973 పరుగులు బాదాడు. ఈ ఒక్క సీజన్లోనే విరాట్ నాలుగు శతకాలు నమోదు చేశాడు. 2016లో ఆరెంజ్ క్యాప్ సైతం విరాట్‌కే దక్కింది. ఇక సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు (973) బాదిన రికార్డ్ కూడా విరాట్ పేరిటే ఉంది. ఇక అత్యధిక పరుగుల జాబితాలో విరాట్ తర్వాత స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ (6754 పరుగులు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఐపీఎల్లో ఆత్యధిక పరుగులు బాదిన బ్యాటర్లు
- విరాట్ కోహ్లీ- 7575 పరుగులు (242 మ్యాచ్‌లు)
- శిఖర్ ధావన్- 6754 పరుగులు (221 మ్యాచ్‌లు)
- డేవిడ్ వార్నర్- 6545 పరుగులు (180 మ్యాచ్‌లు)
- రోహిత్ శర్మ- 6280 పరుగులు (246 మ్యాచ్‌లు)
- సురేశ్ శర్మ- 5528 పరుగులు (205 మ్యాచ్‌లు)