Team India Jersey:వరల్డ్‌కప్ నెగ్గి గురువారం భారత్‌కు వచ్చిన టీమ్ఇండియాకు దిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో అక్కడ్నుంచి టీమ్ఇండియా ప్లేయర్లంతా దిల్లీ ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లారు. హోటల్లో రీ- ఫ్రెష్ అయ్యిన అనంతరం టీమ్ఇండియా స్పెషల్ బస్సులో ప్రధాని మోదీ నివాసానికి బయల్దేరింది. అయితే మోదీ ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో ప్లేయర్లంతా రెగ్యులర్ ఔట్‌ఫిట్‌కు బదులుగా టీమ్ఇండియా టీ20 వరల్డ్‌కప్ జెర్సీని ధరించారు. రెగ్యులర్‌గా అయితే జెర్సీపై ఇండియా 'INDIA' అని మాత్రమే రాసి ఉంటుంది. కానీ, జెర్సీ ఎప్పటిలాగే కాకుండా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. ఇండియాతోపాటు 'ఛాంపియన్స్' అనే పదాన్ని చేర్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రధానితో ముగిసిన భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో టీమ్ఇండియా సమావేశం ముగిసింది. కాసేపు ప్లేయర్లతో గడిపిన మోదీ వారితో సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు. జట్టుతో కలిసి మోదీ గ్రూప్ ఫొటో దిగారు. వరల్డ్‌కప్ నెగ్గిన సందర్భంగా టీమ్ఇండియాను ఆయన అభినందించారు. ఇక దాదాపు గంటసేపు తర్వాత భేటీ ముగిసింది. టీమ్ఇండియా ప్లేయర్లు తిరిగి ముంబయి బయల్దేరారు. ఇక సాయంత్రం ముంబయిలో జరిగే రోడ్ షోలో టీమ్ఇండియా ప్లేయర్లు పాల్గొంటారు. ఈ రోడ్ షోకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యే ఛాన్స్ ఉంది.