తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ కీలక ప్రకటన - ఇకపై టీ20 ప్రపంచకప్​లోనూ రిజర్వ్ డే

Reserve Day For T20 World Cup 2024 : ఇంటర్నేషనల్‌ క్రికెట్ కౌన్సిల్ (ICC) టీ20 వరల్డ్‌ కప్‌లో కొన్ని కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా రానున్న టోర్నీ కోసం రిజర్వ్​ డేను ప్రకటించింది. ఆ విశేషాలు మీ కోసం

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 7:03 PM IST

Reserve Day For T20 World Cup
Reserve Day For T20 World Cup

Reserve Day For T20 World Cup 2024 : ప్రపంచ క్రికెట్‌ అభిమానులు రానున్న కొన్ని నెలలు అంతులేని క్రికెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంజాయ్‌ చేయనున్నారు. మార్చి 22న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2024) మొదలు కాబోతోంది. ఆ తర్వాత T20 వరల్డ్‌ కప్ 2024 జూన్ 2న కెనడా- యూఎస్‌ఏ మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఇప్పటికే టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ విడుదల చేశారు. తాజాగా ఇంటర్నేషనల్‌ క్రికెట్ కౌన్సిల్ (ICC) టీ20 వరల్డ్‌ కప్‌లో కొన్ని కీలక మార్పులు చేసింది. కీలక మ్యాచ్‌ల మజాను అభిమానులు కోల్పోకుండా ఈ చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఇప్పుడు రిజర్వ్​ డేను అమలు చేయనుంది.

ఆ రెండు రోజులు
ఈ సారి టీ20 ప్రపంచ కప్ 2024 సెమీ-ఫైనల్, ఫైనల్ కోసం రిజర్వ్ డేలు కేటాయించారు. అలా ఐసీసీ రానున్న టోర్నీ సెమీఫైనల్ (జూన్ 27), ఫైనల్ (జూన్ 29) ఐసీసీ రిజర్వ్‌ డే తీసుకొచ్చింది. వాతావరణం లేదా ఇతర ఊహించని పరిస్థితులు మ్యాచ్‌కి అంతరాయం కలిగిస్తే, రిజర్వ్‌ డేలో మ్యాచ్‌ని తిరిగి నిర్వహిస్తారు. లీగ్ లేదా సూపర్ ఎయిట్ స్టేజ్‌లో పూర్తి మ్యాచ్‌ను నిర్వహించడానికి సెకండ్‌ బ్యాటింగ్ చేసే జట్టుకు కనీసం ఐదు ఓవర్లు బౌల్ చేయాల్సి ఉంటుంది. అయితే నాకౌట్ మ్యాచ్‌లలో, ఒక మ్యాచ్‌ని ఏర్పాటు చేయడానికి సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కనీసం 10 ఓవర్లు బౌల్ చేయాల్సి ఉంటుంది.

టీ20 వరల్డ్‌ కప్‌ 2026 సెలక్షన్‌ ఎలా?
టీ20 ప్రపంచ కప్ 2026కి అర్హత ప్రక్రియను కూడా ఐసీసీ ఆమోదించింది. ఈ నేపథ్యంలో రానున్న టోర్నీని భారత్‌, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఇందులో మొత్తం 20 జట్లు పాల్గొననుండగా, అందులో 12 జట్లు వాటంతట అవే క్వాలిఫై అవుతాయి. 2024 వరల్డ్‌కప్‌లో మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచిన టీమ్‌లు కూడా ఆటోమేటిక్‌గా క్వాలిఫై అవుతాయి. 2024 జూన్ 30 నాటికి ఐసీసీ టీ20ఐ ర్యాంకింగ్స్‌లో తర్వాత అత్యుత్తమ ర్యాంక్‌లో ఉన్న టీమ్‌లు మిగిలిన స్థానాలకు సెలక్ట్‌ అవుతాయి. ఇక మిగిలిన ఎనిమిది స్థానాలను ఐసీసీ రీజినల్ క్వాలిఫయర్స్ ద్వారా భర్తీ చేస్తారు.

ABOUT THE AUTHOR

...view details