Ravindra Jadeja CSK :టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన బౌలింగ్ స్కిల్స్‌తో వరుస వికెట్లు పడగొట్టి ప్రత్యర్థులను చిత్తు చేసే ఈ స్టార్, బ్యాటింగ్‌లోనూ అదరగొడుతుంటారు. క్రీజులోకి వచ్చాడంటే ఇక బౌండరీలు బాదుతూ చెలరేగిపోతుంటాడు. తాజాగా చేపక్ స్టేడియం వేదికగా కోల్‌కతాతో జరిగిన పోరులోనూ తన సత్తా చాటాడు. మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకుని చెన్నై గెలుపులో కీలకమయ్యాడు.
అయితే ఈ స్టార్ క్రికెటర్ ఈ మ్యాచ్‌లో చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. అతడు చేసిన అల్లరి గురించి అభిమానులు చెప్పుకుని నవ్వుకుంటున్నారు. మమల్ని ప్రాంక్ చేశావ్ కదా గురు అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?
మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగుతున్న సమయంలో నాలుగో స్థానంలో వచ్చిన శివవ్ దుబె ఔటయ్యాడు. అయితే అందరి దృష్టి డగౌట్ పై పడింది. తమ ఫేవరట్ స్టార్ ధోనీ క్రీజులోకి ఎంట్రీ ఇచ్చే మూమెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో స్టేడియంలోని అందరూ ధోనీ ధోనీ అంటూ అరవడం మొదలెట్టారు. అయితే సరిగ్గా అదే సమయంలో బ్యాట్ పట్టుకుని జడేజా బయటకి వచ్చాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.