తెలంగాణ

telangana

ETV Bharat / sports

గెంతులేస్తూ కావ్య మారన్ సెలబ్రేషన్స్ - ఏడ్చేసిన రాజస్థాన్ లేడీ ఫ్యాన్! - Sunrisers Kavya Maran Celebrations - SUNRISERS KAVYA MARAN CELEBRATIONS

IPL 2024 Surisers Hyderabad Kavya Maran Celebrations : సన్‌రైజర్స్ హైదరబాద్ ఓనర్​ కావ్య మారన్​ ఏం చేసినా సోషల్ మీడియాలో ఇట్టే ట్రెండ్ అవుతుంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్​ జట్టు ఫైనల్ చేరుకోవడంతో కావ్య మారన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె గెంతులేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్న వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా ఆమె హావాభావాలు అందర్నీ ఫిదా చేస్తున్నాయి. మీరు చూశారా?

Source The Associated Press
SRH (Source The Associated Press)

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 8:06 AM IST

IPL 2024 Surisers Hyderabad Kavya Maran Celebrations :ఐపీఎల్ 2024 టైటిల్ గెలుచుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. శుక్రవారం మే 24న జరిగిన సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను 36 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో చిదంబరం స్టేడియం వేదికగా దక్కిన ఈ విజయం ఫైనల్ ఆడేందుకు అర్హత తెచ్చిపెట్టింది.

ఈ మ్యాచ్ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే ఈ పోరు ఎప్పటికీ గుర్తుండిపోయే ఫలితాన్ని ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా అంతా ఆరెంజ్​ కలర్​తో నింపేస్తున్నారు. అలాగే స్టేడియంలో కూర్చొని మ్యాచ్ వీక్షించిన ఆరెంజ్ ఆర్మీ ఫ్రాంఛైజీ ఓనర్ కావ్య మారన్ ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి.

ఆమె మ్యాచ్ ముగిసేంతవరకూ ఎదురుచూడకుండానే సంతోషంలో మునిగి తేలిపోయింది. ధ్రువ్ జురేల్ ఔట్​ అవడంతో చివరి ఓవర్‌లో రాజస్థాన్‌కు 42 పరుగులు కావాల్సి ఉంది. అప్పటికే మ్యాచ్ గెలిచేశామనే కాన్ఫిడెన్స్‌లో ఉన్న కావ్య గెంతులేస్తూ సెలబ్రేట్ చేసుకుంది. ఎస్ఆర్‌హెచ్ స్టాండ్‌లో ఉన్న తన తండ్రిని ఆలింగనం చేసుకుని సంతోషాన్ని పంచుకుంది. ఇక మ్యాచ్ విజయం సాధించాక ఆమె ఎగ్జైట్ అవుతూ పలికించిన హావభావాలు ఇంటర్నెట్​లో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్​లో ఓటమితో పింక్ ఆర్మీ ఇంటిముఖం పట్టింది. దీంతో రాజస్థాన్ ఫ్యాన్స్​ శోకసంధ్రంలోకి వెళ్లిపోయారు. చివరిదాకా వచ్చి వెనుదిరగడంతో డైహార్డ్​ ఫ్యాన్స్​ కన్నీరు పెట్టుకున్నారు. స్టేడియంలో ఒక లేడీ ఫ్యాన్ అయితే మ్యాచ్ ఓడిపోతున్నామనే బాధలో ఏడుస్తున్న వీడియో ఒకటి కూడా వైరల్ అయింది. కాగా, టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేయగలిగింది. ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ ఒక్కడే 34 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టులో హై స్కోరర్​గా నిలిచాడు. లక్ష్య చేధనలో భాగంగా సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన రాజస్థాన్ రాయల్స్ 139 పరుగులకే చాప చుట్టేసింది. చెపాక్ స్టేడియం సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఆనందం మిగిలిస్తే రాజస్థాన్ రాయల్స్‌కు చేదు అనుభవం అందించింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్ సమరంలో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో చెలరేగి ఆడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌ పాట్ కమిన్స్ టీమ్​తో పోటీకి దిగనుంది. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడించిన కోల్‌కతాతోనే తుదిపోరులో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ తుది పోరుకు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక కానుంది.

ABOUT THE AUTHOR

...view details