IPL 2024 Sanju Samson Fined :ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కెప్టెన్ సంజూ శాంసన్ (86) ఒక్కడే తన బ్యాట్‌తో పోరాడాడు. కానీ వివాదాస్పద ఔట్‌తో క్రీజును విడిచాడు. దీంతో రాజస్థాన్ ఓటమి బాధ తప్పలేదు. అయితే తన ఔట్ నిర్ణయంపై అంపైర్‌తో వాగ్వాదం చేశాడు.
అయితే మ్యాచ్ అనంతరం ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఈ వివాదాన్ని పరిగణలోకి తీసుకుని సంజూ శాంసన్‌కు భారీ జరిమానా విధించింది. ఈ మేరకు ఓ కీలక ప్రకటనను జారీ చేసింది. "రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూపై మ్యాచ్ ఫీజ్‌లో 30 శాతం ఫైన్ విధించాం. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అతడు ఉల్లంఘించడమే ఇందుకు కారణం. అతడు ఆర్టికల్ 2.8 లెవల్ 1 నేరానికి పాల్పడినట్లు తేలింది. మ్యాచ్ రిఫరీ నిర్ణయం మేరకే ఈ జరిమానాను విధించడం జరిగింది" అని కమిటీ వెల్లడించింది.
అసలేం జరిగిందంటే? -క్రీజులో దూకుడుగా ఆడిన సంజూ ముకేశ్ కుమార్ వేసిన 16వ ఓవర్లో షార్ట్ పిచ్ బాల్‌ను లాంగాన్ వైపు సిక్సర్ బాదేందుకు ట్రై చేశాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న హోప్ బంతిని క్యాచ్‌ను పట్టుకున్నాడు. అయితే క్యాచ్ పట్టగానే అతడి ఎడమ పాదం బౌండరీ హద్దును తాకింది. అంటే దాదాపుగా తాకినట్లు రీప్లేలో కనిపించింది. అతడి షూకు, బౌండరీ లైన్‌కు మధ్య అస్సలు ఖాళీనే కనిపించలేదు. కానీ రీప్లే చూసి మూడో అంపైర్ ఔట్ ప్రకటించాడు. బాల్ బౌండరీ హద్దును తాకిందన చెప్పడానికి స్పష్టమైన ఆధారం కనిపించలేదు. దీంతో సంజూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంపైర్‌తో వాదించాడు. కానీ ఫలితం దక్కలేదు. వాస్తవానికి అప్పటికే రాజస్థాన్ రాయల్స్ స్కోరు 162 . మరో 26 బంతుల్లో 60 పరుగులు చేయాల్సి ఉంది. కానీ సంజూ తర్వాత వచ్చినోళ్లను దిల్లీ బౌలర్లు కట్టడి చేయడంతో చివరికి రాయల్స్ 20 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.
చాహల్ అదిరే రికార్డ్ - టీ20 క్రికెట్లో తొలి భారత బౌలర్‌గా - IPL 2024 Chahal
శాంసన్ మెరిసినా - రాజస్థాన్‌పై దిల్లీదే విజయం - IPL 2024