IPL 2024 Final Live Updates :
- మూడోసారి ఐపీఎల్ విజేతగా కోల్‌కతా
ఐపీఎల్ 17 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. - సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. 2012, 2014లోనూ కేకేఆర్ ఐపీఎల్ విజేతగా నిలిచింది.
- తొలుత కోల్‌కతా బౌలర్లు చెలరేగడంతో హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. కమిన్స్ (24) టాప్ స్కోరర్.
- 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 10.3 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది.
- సునీల్ నరైన్ (6) విఫలమైనా.. వెంకటేశ్ అయ్యర్ (52*; 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ బాదాడు. రెహ్మనుల్లా గుర్బాజ్ (39; 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.
దూకుడుగా ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్
- వెంకటేశ్ అయ్యర్ (19; 5 బంతుల్లో) దూకుడుగా ఆడుతున్నాడు.
- భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్‌లో వరుసగా 4, 6, 6 బాదేశాడు.
- చివరి మూడు బంతులకు వరుసగా 1, 1, 2 వచ్చాయి.
- 3 ఓవర్లకు కేకేఆర్ స్కోరు 37/1. గుర్బాజ్ (9) పరుగులతో ఉన్నాడు.
తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా
కోల్‌కతా తొలి వికెట్ కోల్పోయింది. రెండో సిక్స్‌కు ప్రయత్నించిన సునిల్ నరైన్(6; 2 బంతుల్లో) ఔట్ అయ్యాడు.
- కోల్‌కతాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
- దీంతో 18.3 ఓవర్లలో సన్‌రైజర్స్ 113 పరుగులకే ఆలౌటైంది.
- టాప్ స్కోరర్‌గా నిలిచిన పాట్ కమిన్స్ (24) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.
క్లాసెన్ (16) ఔట్- హైదరాబాద్ ఆశలు ఆవిరి
స్కోరు 90-8
సన్‌రైజర్స్ ఐదో వికెట్ డౌన్
- హైదరాబాద్ 62 పరుగులకే హైదరాబాద్ ఐదు వికెట్లు కోల్పోయి మరింత కష్టాల్లో పడింది.
- మార్‌క్రమ్ (20) ఔటయ్యాడు. రస్సెల్ వేసిన 11 ఓవర్‌లో రెండో బంతికి మిచెల్ స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
- హైదరాబాద్ నాలుగో వికెట్ కోల్పోయింది. నితీశ్ రెడ్డి (13) ఔటయ్యాడు.
- హర్షిత్ రాణా వేసిన ఏడో ఓవర్‌లో తొలి బంతికి ఫోర్ బాదన నితీశ్.. చివరి బంతికి వికెట్ కీపర్ గుర్బాజ్‌కు క్యాచ్ ఇచ్చాడు.
- 7 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 47/4.
- 21 పరుగులకే హైదరాబాద్ మూడు వికెట్లు
మూడో వికెట్ కోల్పోయి హైదరాబాద్ తీవ్ర కష్టాల్లో పడింది. 4.2 ఓవర్లలో 21 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఓపెనర్లు ఔట్
- హైదరాబాద్‌కు మరో షాక్ తగిలింది. ట్రావిస్ హెడ్ (0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.
- వైభవ్ అరోరా వేసిన రెండో ఓవర్‌లో మొదటి బంతులకు పరుగులేమీ రాలేదు.
- నాలుగో బంతికి లెగ్ బైస్ రూపంలో 2 రన్స్
- ఐదో బంతికి సింగిల్.
- చివరి బంతికి ట్రావిస్ హెడ్ (0) వికెట్ కీపర్ రెహ్మనుల్లా గుర్బాజ్‌కు క్యాచ్ ఇచ్చాడు.
- 2 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 6/2.