తెలంగాణ

telangana

ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన బుమ్రా- టీమ్​ఇండియా నుంచి తొలి పేసర్​గా రికార్డ్​ - ICC Test Rankings 2024

ICC Test Rankings Bumrah: టీమ్​ఇండియా పేసర్ బుమ్రా తాజా టెస్టు ర్యాంకింగ్స్​లో టాప్​లోకి దూసుకెళ్లాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్​లో బుమ్రా మూడు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

చరిత్ర సృష్టించిన బుమ్రా  - కెరీర్​లో తొలిసారి అగ్రస్థానానికి
చరిత్ర సృష్టించిన బుమ్రా - కెరీర్​లో తొలిసారి అగ్రస్థానానికి

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 2:07 PM IST

Updated : Feb 8, 2024, 7:29 AM IST

ICC Test Rankings Bumrah:టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సంచలనం సృష్టించాడు. టెస్టు ర్యాంకింగ్స్​లో నెం.1 ర్యాంకు సాధించిన తొలి భారతీయ పేస్ బౌలర్​గా రికార్డు కొట్టాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్​లో బుమ్రా టెస్టు బౌలింగ్​ విభాగంలో మూడు స్థానాలు ఎగబాకి టాప్​లోకి దూసుకెళ్లాడు. ప్రస్తుతం బుమ్రా 881 రేటింగ్స్​తో ఆగ్రస్థానంలో ఉండగా సౌతాఫ్రికా పేసర్ కగిసొ రబాడా 851 రేటింగ్స్​తో రెండో ప్లేస్​లో కొనసాగుతున్నడు. ఇక టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 841 రేటింగ్స్​తో మూడు, రవీంద్ర జడేజా 746 రేటింగ్స్​తో తొమ్మిదో స్థానంలో ఉన్నారు.

ప్రస్తుతం ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్టు సిరీస్ (Ind vs Eng Test Series 2024)​లో రెండో మ్యాచ్​లో బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. రెండో మ్యాచ్​లో ఏకంగా 9 వికెట్లు నేలకూల్చి, ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్​ను రెండు ఇన్నింగ్స్​ల్లోనూ సూపర్ యార్కర్​తో క్లీన్​ బౌల్డ్​ చేయడం మ్యాచ్​కే హైలైట్​గా నిలిచింది. ఈ క్రమంలోనే బుమ్రా టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. అలాగే భారత్‌ తరఫున వేగంగా 150+ వికెట్లు తీసిన పేసర్‌గానూ నిలిచాడు.

మరోవైపు ఈ సిరీస్​లో మూడో టెస్టు కోసం ఇరుజట్లు సిద్ధమౌతున్నాయి. ఈ క్రమంలో మూడో మ్యాచ్​కు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పనిభారాన్ని తగ్గించేందుకే మేనేజ్​మెంట్ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తొలి రెండు టెస్టుల్లో కలిపి బుమ్రా 57.5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. రెండు జట్లలో కలిపి మరే ఫాస్ట్ బౌలర్ కూడా ఇన్ని ఓవర్లు బౌలింగ్ చేయలేదు. రెండు టెస్టుల్లో కలిపి బుమ్రా 14 మెయిడెన్ ఓవర్లు వేశాడు. ఇక 10.66 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్​లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ కూడా బుమ్రానే. అయితే రెండో టెస్టులో బెంచ్​కు పరిమితమైన మహ్మద్ సిరాజ్​ను బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

బీసీసీఐ షాకింగ్ డెసిషన్- మూడో టెస్టుకు బుమ్రాకు దూరం!- ఎందుకంటే?

విశాఖ టెస్టులో భారత్ విజయం- 1-1తో సిరీస్ సమం

Last Updated : Feb 8, 2024, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details