Heinrich Klaasen T20 Sixer Record :డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లోసౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఓ రేర్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో ఒకే ఏడాదిలో వంద సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఆ మ్యాచ్‌లో అతడు 22 బంతుల్లోనే 25 రన్స్ పరుగులు స్కోర్ చేశాడు. ఇక ఆ ఇన్నింగ్స్‌లో ఓ సిక్సర్ కూడా ఉండటం విశేషం.
అయితే ఈ ఒకే ఏడాదిలో వంద సిక్సర్లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో క్లాసెన్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇతడికంటే మందు ముగ్గురు వెస్టిండీస్ ప్లేయర్లు ఆ లిస్టులో ఉన్నారు. దిగ్గజ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ 2011, 2012, 2013, 2015, 2016, 2017లో వందేసి సిక్సర్లు బాదాడు. ఇక అదే దేశానికి చెందిన నికోలస్ పూరన్ కూడా 2024లో వంద సిక్సర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ ఆండ్రూ రసెల్ 2019లో ఈ రికార్డును అందుకున్నాడు.
మ్యాచ్ ఎలా సాగిందంటే?
South Africa vs India 1st T20I :ఇక డర్బన్ వేదికగా శనివారం జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా 61 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. భారత జట్టు నిర్దేశించిన 203 పరుగుల లక్ష్య ఛేదనలో సఫారీలు విఫలమయ్యారు. దీంతో 17.5 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటయ్యారు. ఇందులో హెన్రిచ్ క్లాసెన్ (25 పరుగులు) మాత్రమే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక టీమ్ఇండియా బౌలర్లలో స్పిన్నర్లు రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి చెరో 3 వికెట్లు పడగొట్టగా, ఆవేశ్ ఖాన్ 2, అర్షదీప్ సింగ్ 1 వికెట్ తన ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు ఈ విజయంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది.