Gukesh World Chess Championship 2024 : ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఆటగాడు చెన్నైకి చెందిన 18 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ డి.గుకేశ్ చరిత్ర సృష్టించాడు. ట్రోఫీ గెలుచుకునే లక్ష్యం దిశగా కీలక ముందడుగు వేశాడు. బుధవారం జరిగిన మూడో రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించాడు. చైనా ఆటగాడు డింగ్ లిరెన్‌పై గుకేశ్ తొలిసారి విజయం సాధించాడు. ఈ గెలుపుతో కీలక మైలురాయి అందుకున్నాడు. ఛాంపియన్‌షిప్‌లో మూడు గేమ్‌ల తర్వాత ఇద్దరి స్కోరు 1.5 పాయింట్లతో సమయం అయింది.
తొలి గేమ్‌లో ఓడిపోయిన తర్వాత, గుకేశ్ అద్భుతంగా పుంజుకున్నాడు. తెల్ల పావులతో ఆడుతూ డింగ్ లిరెన్‌కి టైమ్ మేనేజ్‌మెంట్‌లో ఎదురైన సమస్యలను సద్వినియోగం చేసుకున్నాడు. 13వ ఎత్తు వేసే సరికి గుకేశ్ కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే ఉపయోగించాడు. ఈ ఎత్తులకు లిరెన్ దాదాపు గంటకు పైగా సమయం తీసుకున్నాడు.
మ్యాచ్‌లో 120 నిమిషాల్లో 40 ఎత్తులు వేయాల్సి ఉంటుంది. ప్రారంభంలోనే డిండ్ చాలా సమయం తీసుకున్నాడు. దీంతో క్లిష్టమైన మిడిల్-గేమ్ పొజిషన్‌లో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. గుకేశ్ వేగంగా, కచ్చితమైన ఎత్తులు వేస్తూ తన ప్రత్యర్థిపై మరింత ఒత్తిడి పెంచాడు. చివరికి డింగ్ కేవలం రెండు నిమిషాల్లో తొమ్మిది ఎత్తులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో గుకేశ్ మరింత వ్యూహాత్మక ఎత్తులతో ఇబ్బందులు సృష్టించాడు. డింగ్ తన 37వ ఎత్తులో సమయం మించిపోయాడు. దీంతో భారత గ్రాండ్‌మాస్టర్ విజయం అందుకున్నాడు.