FIDE World Blitz Chess Championship 2024 :తాజాగా జరిగినవరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత్‌కు చెందిన ఆర్.వైశాలి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన జు జినార్‌పై 2.5-1.5 తేడాతో వైశాలి గెలిచింది. అయితే సెమీస్‌లో చైనాకు చెందిన జు వెంజన్ చేతిలో 0.5-2.5 తేడాతో ఓటమిని చవి చూసింది. ఇక ఇటీవలె ర్యాపిడ్ ఈవెంట్‌లో కోనేరు హంపి టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.
దేశం మరింత గర్వపడేలా చేసింది
మరోవైపు వైశాలి విజయాన్ని కొనియాడుతూ చెస్ అభిమానులు, పలువురు ప్రముఖులు నెట్టింట పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలో చెస్ గ్రాండ్‌మాస్టర్, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన సీనియర్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ ఆమె విజయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వైశాలిపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇక ర్యాపిడ్ ఈవెంట్ టైటిల్‌ను గెలుచుకున్న కోనేరు హంపిని కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా అభినందించారు.
"వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో మెడల్ సాధించిన వైశాలికి అభినందనలు. ఆమె దేశం మరింత గర్వపడేలా చేసింది. ఆమెకూ, ఆమె చెస్‌కు మద్దతు ఇస్తున్నందుకు ఎంతో చాలా సంతోషంగా ఉన్నాం." అంటూ ట్విట్టర్ వేదికగా విశ్వనాథన్ ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు.