Dinesh Karthik Rohit Sharma:రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సోమవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో వీర విహారం చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ వచ్చిన కార్తీక్ సన్‌రైజర్స్ బౌలర్లపై చెలరేగాడు. భారీ లక్ష్య ఛేదనలో 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7సిక్సర్లతో 83 పరుగులతో చిన్నస్వామి స్టేడియాన్ని ఊపేశాడు. కానీ, భారీ లక్ష్యం కావడం వల్ల ఆర్సీబీ 25 పరుగుల తేడాతో ఓడింది. అయిప్పటిప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్ దినేశ్ కార్తీక్ బ్యాటింగ్‌కు మాత్రం ఫిదా అయిపోయారు.
అయితే మ్యాచ్ అనంతరం దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'గత మ్యాచ్‌లో ప్రపంచకప్ కోసం ఓ కెప్టెన్(రోహిత్ శర్మను ఉద్దేశించి) నాపై ఒత్తిడి తెచ్చాడు. అతడు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌ను కూడా చూశాడని అనుకుంటున్నాను. క్రికెట్ ఆడడానికి అతడు ఎప్పుడు పిలిచినా నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టంప్స్ మైక్‌లో రికార్డైన మాటలు అందరూ విని ఉండాలి. రోహిత్ నన్ను వరల్డ్ కప్ కోసం చెలరేగి ఆడుతున్నాను అన్నాడు. రోహిత్‌కు నాపై ఉన్న అపారమైన విశ్వాసం, మద్దతు నేను ఎదగడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నాను. వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు సాధిస్తా (నవ్వుతూ) ' అని ఆర్సీబీ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. దీంతో 'కార్తిక్ వరల్డ్‌కప్‌లో ఎంపికవడం పక్కా', 'డీకే రోహిత్ మాటలు సీరియస్‌గా తీసుకున్నాడు' అని క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.