Cricketers With Most Sixes In IPL : మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతీ బ్యాటర్ బాల్‌ను బౌండరీ దాటించేందుకు ఎంతో ఉవ్విళ్లూరుతుంటాడు. తన బ్లాస్టింగ్ సిక్స్‌ర్‌తో అభిమానుల చేత వావ్ అనిపించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. కొన్ని సార్లు స్టేడియం దాటి ఆ బంతి వెళ్లిన సందర్భాలు కూడా మనం ఎన్నో చూసుంటాం. అయితే ఐపీఎల్‌లో ఇప్పటివరకు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు ఉన్నారు. వారెవరంటే ?
క్రిస్ గేల్ (వెస్టిండీస్):
ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల లిస్ట్‌లో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్. ఇప్పటి వరకు మూడు ఫ్రాంచైజీల తరఫున ఆడిన ఈ స్టార్ క్రికెటర్, 142 మ్యాచ్‌ల్లో 357 సిక్సర్లు బాదాడు.
రోహిత్ శర్మ(ముంబయి ఇండియన్స్):
తన కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్‌ను రికార్డు స్థాయిలో 5 ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది. రోహిత్ శర్మ ఈ టీ20 లీగ్‌లో ఇప్పటివరకు 257 సిక్సర్లు కొట్టాడు.
ఏబీ డివిలియర్స్(రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు):
సౌతాఫ్రికకు చెందిన ఈ స్టార్ క్రికెటర్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. ఇక ఈయన పేరిట ఈ టోర్నీలో 251 సిక్సర్లు ఉన్నాయి.
ఎంఎస్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్):
తన ధనాధన సిక్సర్లతో ప్రత్యర్థులను హడలెత్తిస్తుంటాడు స్టార్ క్రికెటర్ ధోనీ. ఈయన ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 239 సిక్సర్లు కొట్టాడు.
విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు):
రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 234 సిక్సర్లు బాదాడు. అంతే కాకుండా కోహ్లీ ఆడిన 223 మ్యాచ్‌ల్లో 6624 పరుగులు చేశాడు.