తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాజకీయాల్లో క్రికెటర్ల మార్క్- MP టూ PM వరకు- అక్కడా కూడా ఈ స్టార్లదే హవా!

Cricketers In Politics: క్రికెట్ మైదానంలో తమ సత్తా చాటి తర్వాత దేశానికి సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది అంతర్జాతీయ క్రికెటర్లు రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రికెటర్లలో కొంతమంది పిచ్ పై సెంచరీలు కొడితే మరికొందరు రాజకీయ పిచ్​పై తమ విశ్వరూపం చూపించారు. ఆ క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం.

Cricketers In Politics
Cricketers In Politics

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 1:12 PM IST

Cricketers In Politics:రాజకీయాలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. కాలేజీ రోజుల నుంచే రాజకీయాల్లోకి వచ్చినవాళ్లు కొందరు ఉంటే వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చినవారు ఇంకొందరు ఉన్నారు. రంగం ఏదైనా సరే అందరూ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో సినీపరిశ్రమ నుంచి ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారు. సీఎం, ఎంపీ, ఎమ్మెల్యేలుగా రాణించినవారు రాణిస్తున్నవారు ఎందరో ఉన్నారు.

కేవలం సినీపరిశ్రమ నుంచే కాదు క్రికెటర్లు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మైదానంలోనే కాదు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు దేశానికి ప్రధానిగా గెలిచిన వారు ఉన్నారు. తాజాగా టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ ఖాన్​ కూడా రాజకీయల్లోకి ప్రవేశించాడు. యూసుఫ్ తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరి, 2024 లోక్​సభ ఎన్నికల బరిలో దిగనున్నాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు రాజకీయాల్లోకి ప్రవేశించి అక్కడ కూడా రాణించినవారెవరో చూద్దాం.

  • ఇమ్రాన్ ఖాన్: ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ మాజీ క్రికెటర్. రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా పాకిస్థాన్ ప్రధాని అయ్యాడు. పాకిస్థాన్ తెహ్రీన్ ఇ ఇన్సాఫ్ ( పిటిఐ) పార్టీని స్థాపించాడు. 1992లో తన కెప్టెన్సీలో పాకిస్థాన్ ప్రపంచకప్ గెలుచుకోవడంలో ప్రముఖపాత్ర పోషించాడు.
  • మహ్మద్ అజారుద్దీన్: భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 2009లో కాంగ్రెస్‌లో చేరి తన రాజకీయ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా గెలిచాడు. ఇక గతేడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లోనూ జూబ్లిహిల్స్​ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అజారుద్దీన్ 1990లలో 47 టెస్టులకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు.
  • గౌతమ్ గంభీర్: 2019 లోక్‌సభ ఎన్నికలతో రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన గౌతమ్ గంభీర్ బీజేపీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కాగా, క్రికెట్​లో భవిష్యత్​ రిత్యా గంభీర్ ప్రత్యక్ష రాజకీయలకు రీసెండ్​గా గుడ్​బై చెప్పాడు. 2007, 2011లో వన్డే ప్రపంచకప్​లో భారత్ విజయపథంలో దూసుకుపోవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు.
  • ఇయాన్ బోథమ్: ఇంగ్లాండ్​ క్రికెట్ లెజెండ్ ఇయాన్ బోథమ్​ 'క్రాస్ బెంజ్ పీర్'గా జూలై 2020లో హౌస్ ఆఫ్ లార్డ్స్ కు ఎన్నికయ్యాడు. టెస్టు క్రికెట్లో వెయ్యి పరుగులు, 100 వికెట్ల సాధించి క్రికెట్​లో కూడా బోథమ్ సత్తా చాటాడు.
  • నవజ్యోత్ సింగ్ సిద్దూ:భారత్ తరఫున 51 టెస్టులు, 136 వన్డేలు ఆడిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ 2004 లోక్‌సభ ఎన్నికలతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. బీజేపీ టికెట్‌పై ఎన్నికల్లో సిద్ధూ పోటీ చేశాడు.
  • మనోజ్ తివారీ:దేశవాళీ క్రికెట్‌లో మనోజ్ తివారీకి మెరుగైన రికార్డ్ ఉంది. ఓ వైపు క్రికెట్​లో రాణిస్తూనే మనోజ్ 2021లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాడు. 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో శిబ్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచాడు. రాజకీయాల్లో కొనసాగుతూనే మనోజ్ దేశవాళీ క్రికెట్ కూడా ఆడుతున్నాడు.
  • అర్జున రణతుంగ:శ్రీలంక క్రికెట్ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ. క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లోకి వచ్చాడు. ఎంపీగా, మంత్రిగా పనిచేశాడు. 1996లో వరల్డ్ కప్​లో శ్రీలంక విజయపథంలో నడిపించాడు.
  • కీర్తి అజాద్:భారత మాజీ క్రికెటర్ కీర్తిఅజాద్. క్రికెట్ కెరీర్ కు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి వచ్చాడు. బీజేపీలో చేరి ఎంపీగా ఎన్నికయ్యాడు. 1983లో వన్డే ప్రపంచ కప్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టులో ఆజాద్ ఉన్నాడు.
  • చేతన్ చౌహాన్: భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ తన క్రికెట్ కెరీర్ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బీజేపీలో చేరి ఎంపీగా గెలుపొందాడు. సునీల్ గావస్కర్ తో కలిసి టెస్ట్ క్రికెట్లో భారత్ నుంచి బెస్ట్ ఓపెనింగ్ భాగస్వామ్యం ఉంది.
  • సనత్ జయసూర్య:శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎంపీగా విధులు నిర్వహించాడు. వన్డేలలో ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ రాణించాడు. 1996లో శ్రీలంక ప్రపంచ కప్ గెలుచుకోవడంలో జయసూర్య పాత్ర మరువలేనిది.

ABOUT THE AUTHOR

...view details