తెలంగాణ

telangana

ETV Bharat / sports

బీసీసీఐ, పీసీబీతో ఐసీసీ అత్య‌వ‌స‌ర స‌మావేశం - ఆ ఐదు అంశాలపై చర్చ! - ICC EMERGENCY MEETING

ఛాంపియ‌న్స్ ట్రోఫీ నిర్వహణపై బీసీసీఐ, పీసీబీతో ఐసీసీ అత్య‌వ‌స‌ర స‌మావేశం - ఎప్పుడంటే?

Champions Trophy 2025 ICC Emergency Meeting
Champions Trophy 2025 ICC Emergency Meeting (source Getty Images)

By ETV Bharat Sports Team

Published : Nov 23, 2024, 9:28 AM IST

Champions Trophy 2025 ICC Emergency Meeting : వ‌చ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జ‌ర‌గాల్సిన‌ ఛాంపియ‌న్స్ ట్రోఫీ నిర్వహణపై గంద‌ర‌గోళం నెల‌కొన్న సంగతి తెలిసిందే. హైబ్రిడ్​ మోడల్​లో నిర్వహిస్తేనే ఆడుతామని, పాక్​కు వెళ్లేది లేదంటూ భారత్ చెప్పడం​, వచ్చి తీరాల్సిందేనని పాకిస్థాన్ పట్టుపట్టి ఉండటం వల్ల, ఈ సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో, ఐసీసీ, న‌వంబ‌ర్ 11న జ‌ర‌గాల్సిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఈవెంట్‌ను కూడా ర‌ద్దు చేసింది.

అయినా కూడా బీసీసీఐ, పీసీబీ తమ పంతం వీడ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఐసీసీ రంగంలోకి దిగి, అత్య‌వ‌స‌ర‌ స‌మావేశం నిర్వ‌హించాలని అనుకుంటోందని తెలిసింది. ఛాంపియ‌న్స్ ట్రోఫీ నిర్వ‌హ‌ణ‌పై నెల‌కొన్న అనిశ్చితికి తెర‌దించేందుకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. అంటే ఛాంపియ‌న్స్ ట్రోఫీ వేదిక ఖ‌రారు చేసే విషయమై దాయాది బోర్డుల‌ను ఒప్పించ‌డ‌మే ప్ర‌ధాన అజెండాగా ఈ భేటీ జ‌రగ‌నుంది. ఇంకా ఈ ట్రోఫీ నిర్వహణ విషయంలో భద్రత, హోస్టింగ్ హక్కులు, హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనలపై పెరుగుతోన్న భిన్నాభిప్రాయాల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఐసీసీ.

నవంబ‌ర్ 26న ఈ అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వహించనుంది ఐసీసీ. పీసీబీ, బీసీసీఐకు చెందిన ఉన్నతాధికారులను పిలిపించి, రెండు బోర్డుల మ‌ధ్య సయోధ్య కుదిర్చేందుకు ఐసీసీ ప్ర‌తినిధులు ప్ర‌య‌త్నించ‌నున్నారు. అయితే ఈ స‌మావేశంలో ముఖ్యంగా ఐదు అంశాలపై చ‌ర్చించే వీలుందని సమాచారం.

  • భార‌త్ - పాకిస్థాన్ మ్యాచ్ ఎక్క‌డ నిర్వహించాలి? ఇత‌ర గ్రూప్ మ్యాచ్‌లు ఎక్క‌డ జరపాలి?
  • సెమీఫైన‌ల్‌, ఫైన‌ల్ మ్యాచ్‌ల‌ను త‌ట‌స్థ వేదిక‌పై నిర్వహించడం.
  • హైబ్రిడ్ మోడ‌ల్‌కు పాక్ బోర్డు అంగీక‌రించ‌కపోతే? ఎలా ముందుకు వెళ్లాలి?
  • మొత్తం ఛాంపియ‌న్స్ ట్రోఫీనే పాకిస్థాన్ నుంచి తటస్థ వేదికకు త‌ర‌లించ‌డం.
  • పాకిస్థాన్ జ‌ట్టు లేకుండానే ఛాంపియ‌న్స్ ట్రోఫీ నిర్వ‌హించ‌డం.

అంతకుముందు పీసీబీ ఛైర్మన్ మొహసీన్‌ నఖ్వీ మీడియాతో మాట్లాడాడు. టీమ్‌ ఇండియా పాకిస్థాన్‌లో పర్యటించకపోవడానికి గల కారణాలను వివరించాలని, బీసీసీఐని అభ్యర్థిస్తూ పీసీబీ.. ఐసీసీకి లేఖ రాసిందని నఖ్వీ చెప్పారు. ఐసీసీ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. తాము టోర్నీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించడానికి ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు.

'నా భర్త శరీరంలో ఆ భాగం సూపర్​గా ఉంటుంది' - వైరల్​గా మారిన బుమ్రా భార్య పోస్ట్

టాప్ స్కోరర్​గా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ జర్నీ - 7 నెలల్లోనే IPL టు బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ!

ABOUT THE AUTHOR

...view details