Rohit Virat Test Retirement :టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్వదేశంలో తమ ఆఖరి టెస్టు సిరీస్ ఆడేశారా? దిగ్గజ స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మన పిచ్‌లపై చివరిసారిగా బౌలింగ్ చేసేశారా? ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్నలు ఇవి. స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఊహించని రీతిలో పరాజయం ఎదురైన తర్వాత టీమ్ఇండియా సీనియర్ల టెస్టు భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది.
తాజాగా కివీస్‌పై ఓటమి పట్ల బీసీసీఐ అసంతృప్తిగా ఉంది. గత కొంతకాలంగా టెస్టు ఫార్మాట్ ఫ్యూచర్ కోసం పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇలాంటి ఫలితం రావడం వల్ల బీసీసీఐ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టెస్టు జట్టులో సమూల మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తోందట. ముఖ్యంగా సీనియర్లు రోహిత్, విరాట్, జడేజా, అశ్విన్ టెస్టు భవితవ్యంపై కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఇక టీమ్ఇండియాకు 2025 డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న బోర్డర్ గావస్కర్ టోఫ్రీని 4-0తో నెగ్గితేనే భారత్ మూడోసారి ఫైనల్ చేరుకుంటుంది. అయితే ఈ సిరీస్‌కు ఇప్పటికే జట్టును ప్రకటించిన నేపథ్యంలో స్వాడ్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఒకవేళ ఈ సిరీస్‌లో టీమ్ఇండియా విఫలమై WTC, ఫైనల్ చేరకపోతే వచ్చే ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో జట్టులో ఈ నలుగురు సీనియర్లకు చోటు ఉండదని బోర్డు మెంబర్ ఒకరు పేర్కొన్నట్లు తెలిసింది