తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నా ఫోన్ ఎక్కడో పోయింది' - నెట్టింట వాపోయిన పాకిస్థాన్ క్రికెటర్ - BABAR AZAM CHAMPIONS TROPHY

అయ్యో పాపం! ఫోన్ పోగొట్టుకున్న పాక్ క్రికెటర్- కాంటాక్ట్స్ మిస్సింగ్!

BABAR AZAM CHAMPIONS TROPHY
Babar Azam (Getty Images)

By ETV Bharat Sports Team

Published : Feb 7, 2025, 12:40 PM IST

పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ ఐసీసీ టోర్నీ కోసం అన్ని జట్లూ ముమ్మరంగా సిద్ధమవుతున్నాయి. ఆతిథ్య పాకిస్థాన్ జట్టు కూడా ప్రాక్టీస్​లో బిజీగా ఉంది. ఈ క్రమంలో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ బాబర్ అజామ్​కు చేదు అనుభవం ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

'ఫోన్ పోయింది, కాంటాక్ట్ మిస్సింగ్'
బాబర్ అజామ్ ఫోన్ పోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అతడు వెల్లడించాడు. "నా ఫోన్ పోయింది. కాంటాక్ట్స్ కూడా పోయాయి. ఫోన్ దొరికిన తర్వాత అందరికీ మళ్లీ అందుబాటులోకి వస్తాను" అంటూ బాబర్ ట్వీట్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధమవుతున్న సమయంలో బాబర్ అజామ్​కు ఈ షాక్ తగిలింది.

సిద్ధమవుతున్న పాక్
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బాబర్ సహా పాకిస్థాన్ జట్టు సన్నద్ధమవుతోంది. లాహోర్​లో వార్మప్ మ్యాచ్​లు ఆడుతోంది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సౌతాఫ్రికా, కివీస్​తో కలిసి ముక్కోణపు సిరీస్​లో పాక్ ఆడనుంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 8 నుంచి లాహోర్‌లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్​లోనూ రాణించాలని పాక్ ప్లేయర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

తీవ్రంగా శ్రమిస్తోన్న బాబర్
ఛాంపియన్స్ ట్రోఫీ బాబర్ అజామ్​కు చాలా కీలకం. ఇటీవల కాలంలో బాబర్ వరుసగా విఫలమవుతున్నాడు. గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టుల్లో మూడు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించి జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని బాబర్ యోచిస్తున్నారు. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం అవ్వనుంది. ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించేశాయి. ఫిబ్రవరి 11 వరకు టీమ్‌ లలో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది. మరోవైపు, ఈ టోర్నీలో భారత్‌ మ్యాచ్‌ లన్నీ దుబాయ్​లోనే జరగనున్నాయి. భారత్‌ ముందంజ వేస్తే తొలి సెమీఫైనల్ కూడా దుబాయ్​లోనే జరగనుంది. అందులోనూ గెలిస్తే ఫైనల్ కూడా అక్కడే జరుగుతుంది. కాగా, ఫిబ్రవరి 23న భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.

విరాట్​ కోహ్లీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడతాడా? మెగా టోర్నీకి ముందు డౌట్స్ ఎన్నో!

ఛాంపియన్స్​ ట్రోఫీకి ముందు షాకింగ్ న్యూస్ - వన్డే క్రికెట్ గుడ్​బై చెప్పిన ఆసీస్​ ఆల్ ​రౌండర్!

ABOUT THE AUTHOR

...view details