AUS vs IND Border Gavaskar Trophy : క్రికెట్ టెర్మినాలజీలో అలాగే క్రీడాభిమానుల్లో తెగ నానిన మాటల్లో ఫాలో ఆన్ కూడా ఒకటి. గతంలో ఈ పదం బాగానే వినిపించేది. కానీ, ఇటీవల టెస్టుల్లోనూ దూకుడు ఎక్కువైన తర్వాతనే అలాంటి అవకాశమే టీమ్‌లకు రావట్లేదు. అయితే చాలా రోజుల తర్వాత భారత్ 'ఫాలో ఆన్' ఎదుర్కొనే ప్రమాదంలో పడింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురుకానుంది. ఒకవేళ ఫాలో ఆన్ ఆడాల్సి వస్తే ఆసీస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం క్రీడాభిమానుల్లో అలాగే దిగ్గజ క్రికెటర్లలో ఆసక్తికర అంశంగా మారింది.
రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
ఎంసీసీ నివేదించిన రూల్స్ ప్రకారం తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు మాత్రమే 'ఫాలో ఆన్'పైన తుది నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు ఆస్ట్రేలియా 445 పరుగులు స్కోర్ చేసింది. ఒక వేళ భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు కూడా చేయకపోతే ఫాలో ఆన్‌లో పడినట్లే. అయితే భారత్‌ను రెండో ఇన్నింగ్స్ కోసం బ్యాటింగ్‌కు ఆహ్వానించాలా? వద్దా? అనేది ఆస్ట్రేలియా ఇష్టం. అలాకాకుండా రెండో ఇన్నింగ్స్‌ను ఆసీస్ ఆడాలని నిర్ణయం తీసుకొనే అవకాశం కూడా లేకపోలేదు.