తెలంగాణ

telangana

ETV Bharat / sports

SRH బ్యాటర్ విధ్వంసం- కావ్య పాప ఫుల్ ఖుష్ - రూ.3 కోట్లకు వర్త్ వర్మ వర్తు! - ABHINAV MANOHAR SRH

విజృంభించిన సన్​రైజర్స్​ బ్యాటర్- కళ్లు చేదిరే షాట్లతో సూపర్ హాఫ్ సెంచరీ

SRH Player
SRH Player (Source : Getty Images, ETV Bharat)

By ETV Bharat Sports Team

Published : Jan 18, 2025, 7:13 PM IST

Abhinav Manohar SRH :సన్​రైజర్స్​ యువ బ్యాటర్ అభినవ్ మనోహర్ సూపర్ ఫామ్​లో దూసుకుపోతున్నాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అభినవ్ ఫైనల్​లో అదిరే ప్రదర్శన చేశాడు. విదర్భతో జరుగుతున్న ఫైనల్​లో అభినవ్ సూపర్ హాఫ్ సెంచరీతో రఫ్పాడించాడు. 42 బంతుల్లో 79 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 348 పరుగుల భారీ స్కోర్ చేసింది.

17 బంతుల్లోనే 55 పరుగులు
మ్యాచ్​లో నాలుగు వికెట్లు పడ్డ తర్వాత క్రీజులోకి వచ్చిన అభినవ్ నెమ్మదిగానే ఇన్నింగ్స్​ ప్రారంభించాడు. ఓ దశలో 25 బంతుల్లో అభినవ్ చేసింది 24 పరుగులే. కానీ, 44వ ఓవర్​ తర్వాత అభినవ్ విధ్వంసం మొదలైంది. బౌండరీలతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

అర్ధ శతకం తర్వాత కూడా అతడు భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. మొత్తం 42 బంతుల్లో 79 పరుగులు నమోదు చేశాడు. అంటే చివరి 17 బంతుల్లోనే అభినవ్ 55 పరుగులు బాదడం విశేషం. కాగా, ఇన్నింగ్స్​లో 10 ఫోర్లు, 4 సిక్స్​లు ఉన్నాయి. అంటే 79 రన్స్​లో 64 పరుగులు బౌండరీల ద్వారానే రావడం గమనార్హం. వన్డే మ్యాచ్​లో టీ20 తరహా ఈ ఇన్నింగ్స్​ను సన్​రైజర్స్​ హైదరాబాద్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'మనకు ఫినిషర్ దొరికాడు' అంటూ సన్​రైజర్స్​ ఫ్యాన్స్​ కామెంట్లు పెడుతున్నారు.

కాగా, 2025 మెగా వేలంలో అభినవ్​ను సన్​రైజర్స్ రూ. 3.20 కోట్లకు దక్కించుకుంది. రూ. 30 లక్షల బేస్​ప్రైజ్​తో వేలంలోకి వచ్చిన అభినవ్​ కోసం చైన్నై, బెంగళూరు ఫ్రాంచైజీలు తీవ్రంగా ప్రయత్నించాయి. కానీ, SRH భారీ ధర వెచ్చించి జట్టులోకి తీసుకుంది. ఇక బ్యాట్​తోనే కాకుండా బంతితోనూ మ్యాచ్ స్వరూపం మార్చేయగల సత్తా అభినవ్ సొంతం.

ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 348-6 భారీ స్కోర్ చేసింది. అభినవ్​తోపాటు సమరణ్ రవిచంద్రన్ (110 పరుగులు), కృష్ణజిత్ (78 పరుగులు) రాణించారు.

SRH బ్యాటర్ అభిషేక్ విధ్వంసం- హైదరాబాద్​కు తప్పని ఓటమి

SRHతో 11ఏళ్ల బంధానికి గుడ్​ బై- భువి ఎమోషనల్ వీడియో!

ABOUT THE AUTHOR

...view details