Which Colour to Wear on Each Day of the Week as Per Astrology:ఏ పని చేస్తున్నా కలిసి రాకపోయినా.. తమను దురదృష్టం వెంటాడడం వల్లే పనులు విజయవంతం కావడం లేదని బాధపడుతుంటారు చాలా మంది. అయితే, అలాకాకుండా మిమ్మల్ని అదృష్టం వరిస్తూ.. మీరు చేపట్టిన పనులు విజయవంతం కావాలంటే కలరాలజీని బట్టి రోజూ ధరించే దుస్తుల రంగుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. ఇంతకీ.. కలరాలజీ ప్రకారం 12 రాశుల వారికి వారం రోజుల్లో కలసి వచ్చే రంగులు ఏంటి? కలసిరాని రంగులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆదివారం : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఏ రాశి, ఏ నక్షత్రం వారైనా ఈరోజు లేత ఎరుపు రంగు దుస్తులుధరించడం మంచిదంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. అలాగే.. ఈరోజు కాషాయ(ఆరెంజ్) రంగు వస్త్రాలు ధరించడం విపరీతమైన అదృష్టాన్ని కలిగిస్తుందంటున్నారు. అదే.. పసుపు, తెలుపు రంగులను ధరిస్తే మిశ్రమ ఫలితాలు వస్తాయంటున్నారు. ఇకపోతే.. నలుపు, నీలం, ముదురు ఆకుపచ్చ రంగువి ధరించడం దురదృష్టాన్ని ఇస్తుందట.
సోమవారం : ఈరోజు తెలుపు వస్త్రాలు ధరించడం శ్రేయస్కరమట. అదే.. పసుపు రంగు దుస్తులు ధరిస్తే మిశ్రమ ఫలితాలు ఉంటాయంటున్నారు. అలాగే.. ముదురు ఎరుపు(డార్క్ రెడ్), నలుపు లేదా ముదురు నీలం రంగులు ధరిస్తే ఈ రోజు కలిసిరాదట.. అలాగే ఇవి దురదృష్టాన్ని తెచ్చిపెడతాయంటున్నారు.
మంగళవారం : ముదురు ఎరుపు ధరించడం వల్ల ఈరోజు బాగా కలసివస్తుందట. అదే.. వెండి లాంటి తెల్లటి రంగు మాత్రం మిశ్రమ ఫలితాలను ఇస్తుందంటున్నారు. మంగళవారం ముదురు పచ్చవి, ముదురు నీలం ధరిస్తే.. ఈరోజు దురదృష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు జ్యోతిష్యులు.
బుధవారం :ఈరోజు ముదురు ఆకుపచ్చ వస్త్రాలు వేసుకోవడం బాగా కలసివస్తుందంటున్నారు. అదే.. ముదురు నీలం, నలుపు రంగులు మిశ్రమ ఫలితాలను అందిస్తాయట. బుధవారం ఎరుపు అంతగా కలసిరాదంటున్నారు. అలాగే.. తెలుపు, పసుపువి ఈరోజు ధరించకపోవడమే మంచిదట.
గురువారం :ఈరోజు బాగా కలసిరావాలంటే పసుపు రంగు దుస్తులు వేసుకోవడం మంచిదట. అదే.. ముదురు నీలంవి మిశ్రమ ఫలితాలు ఇస్తాయంటున్నారు. ఇకపోతే గురువారం ముదురు ఎరుపు, లేత ఎరుపు వస్త్రాలు అంత కలసిరావట.