What Not To Do On Friday Hindu :శుక్రవారం ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే ఇక తిరిగి రావంట! అందుకే శుక్రవారం ఎవరికీ అప్పులు ఇవ్వకుండా ఉంటేనే మేలని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ రోజు ఎవరి దగ్గర నుంచి డబ్బులు అప్పుగా తీసుకోరాదు. అలా తీసుకుంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు.
మహిళల జోలికి వెళ్తే ముప్పే!
మహిళలు, బాలికలను లక్ష్మీదేవి స్వరూపంగా భావించడం మన సంప్రదాయంలో భాగం. అందుకే శుక్రవారం నాడు మీ ఇంట్లో కానీ, బయట కానీ స్త్రీలను, బాలికలను కారణం లేకుండా దుర్భాషలాడటం, అవమానించడం వంటివి చేయరాదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక స్త్రీ కూడా మరో స్త్రీని కించపరచకూడదు. ఇలా చేసినట్లయితే శ్రీలక్ష్మీదేవి ఆగ్రహించి ఇంట్లో నుంచి వెళ్లిపోతుందంట. నిజానికి ఒక్క శుక్రవారమే కాదండీ ఎప్పుడు కూడా స్త్రీలను గౌరవించాల్సిందే!
యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః! అని పెద్దలు అన్నారు కదా! అంటే ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడ శ్రీలక్ష్మీతో సహా సకల దేవతలు కొలువై ఉంటారని శాస్త్ర వచనం. అందుకే స్త్రీలను కించపరిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికాక తప్పదు.
శుక్రవారం ఇవి ఎవరికైనా ఇస్తే దరిద్రమే!
శుక్రవారం పాత బట్టలు, వాడని గాజులు వంటివి ఎవరికీ ఇవ్వరాదు. ఒకవేళ మీకు అవసరం లేకపోతే వారంలో మరో రోజు ఎప్పుడైనా ఇవ్వండి కానీ శుక్రవారం మాత్రం అసలు ఇవ్వొద్దు. అలా ఇస్తే దారిద్ర దేవతను ఆహ్వానించినట్లే!