Do These Remedies on Sri Rama Navami: ధర్మ రక్షకుడైన శ్రీరాముడిని కీర్తిస్తూ భక్తజనం జరుపుకునే పవిత్ర పర్వదినం శ్రీరామ నవమి. ఏటా చైత్ర మాసం శుక్ల పక్షం నవమి రోజున శ్రీరామనవమిని ఘనంగా జరుపుకుంటారు. కాగా ఈ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీ బుధవారం నాడు రాముల వారి పండగను జరుపుకోనున్నారు. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన రోజే చైత్ర మాస శుక్లపక్ష నవమి శ్రీరామ నవమి. ఇంతటి మహోత్తమమైన పర్వదినాన కొన్ని పరిహారాలు చేయడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని.. సీతారాముల ఆశీర్వాద బలంతో సుఖశాంతులు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. మరి ఆ పరిహారాలేంటో ఈ స్టోరీలో చూద్దాం..
ఆర్థికంగా స్థిరపడేందుకు: ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కెందుకు శ్రీరామనవమి రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో 11 గోమతి చక్రాలు, 11 కరివేపాకులు, 11 లవంగాలు, పంచదారతో చేసిన 11 బతషాలు ఉంచి లక్ష్మీదేవికి, రాముడికి సమర్పించాలని.. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు.
పాజిటివ్ ఎనర్జీ కోసం:ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని 108 సార్లు శ్రీరామరక్ష మంత్రాన్ని జపించి.. తర్వాత ఆ నీటిని ఇల్లు మొత్తం చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూల శక్తి ప్రసరిస్తుందని పేర్కొంటున్నారు.
ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే - లక్ష్మీదేవి అనుగ్రహం మీ వెంటే!
ఆరోగ్యంగా ఉండేందుకు:ప్రస్తుత రోజుల్లో వివిధ కారణాల వల్ల చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. అయితే ఆరోగ్యంగా ఉండేందుకు ఆంజనేయుడి అనుగ్రహం తప్పనిసరి అంటున్నారు పండితులు. హనుమంతుడి అనుగ్రహం ఉంటే ఎటువంటి వ్యాధులు, భయాలైన తొలగిపోతాయని తెలుపుతున్నారు. అందుకోసం శ్రీరామనవమి రోజు సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలని.. అలాగే హనుమాన్ చాలీసా పఠించాలని సూచిస్తున్నారు. అలాగే సంతోషంగా ఉండేందుకు నవమి రోజున రామాలయంలో నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించాలని.. జై శ్రీరామ్ అనే నామాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని అంటున్నారు.
భార్యాభర్తల అన్యోన్యతకు:చాలా మంది వైవాహిక జీవితం నిత్యం గొడవలు, అలకలతో సాగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే శ్రీరామనవమి రోజు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సీతారాములకు పసుపు, కుంకుమ, గంధాన్ని సమర్పించాలి. ఓం జై సీతారాం అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల వివాహ బంధంలోని సమస్యలు తొలగిపోయి.. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుందని అంటున్నారు. అలాగే సంతానం కోసం ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొబ్బరికాయ చుట్టి సీతాదేవికి సమర్పించాలని.. జైశ్రీరామ్ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి సీతమ్మ తల్లికి పూజలు చేయాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల సంతాన ప్రాప్తి లభిస్తుందని తెలుపుతున్నారు.
Note: పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇంట్లో లేదా ఆఫీస్లో ఒక చిన్న నెమలి ఈకను పెట్టుకోండి - మీ సంపద అమాంతం పెరుగుతుంది!
మూడు రోజుల్లో శ్రీరామనవమి - చక్కటి స్వామివారి పానకం ఎలా తయారు చేయాలో తెలుసా?