Vinayaka Chaturthi Puja Items List :వినాయక చవితి పండుగ అంటే ఇష్టం లేని వారు ఉండరు. సాధారణంగా ఏ పండుగైనా ఇంట్లో కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య జరుపుకుంటారు. కానీ వినాయక చవితి పండుగ మాత్రం ఊరు వాడా ఒక్కటై కోలాహలంగా జరుపుకునే పండుగ. మరి బొజ్జ గణపయ్య పూజకు ఏమేమి కావాలో ఎలా తెలుస్తుంది? ఇదిగో మీ అందరి కోసమే ఈ పూజ సామగ్రి లిస్ట్. ఈ లిస్ట్ ప్రకారం అన్ని ఉంటే గణపతి పూజకు సర్వం సిద్ధమయినట్టే!
వినాయక చవితి పూజ చాలా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాల్సిన పండుగ. ఏ ఒక్క వస్తువు కూడా లోటు లేకుండా అన్నీ ముందుగా సమకూర్చుకోవాలి. ఇలాంటప్పుడే అనిపిస్తుంది కదా ముందుగా లిస్ట్ రాసుకుంటే మంచిదని! ఇది మీ కోసమే ఈ పూజా సామాగ్రి పట్టిక! ఇక పూజకు అన్నీ చకచకా సిద్ధం చేసేసుకుందాం. గణపతి పూజను ఆనందంగా చేసుకుందాం.
వినాయకచవితి పూజ సామగ్రి :
- పసుపు
- కుంకుమ
- గంథం
- పన్నీరు
- పువ్వులు
- అరటిపండ్లు
- తమలపాకులు
- వక్కలు
- పాలవెల్లి
- పాలవెల్లి అలంకరణ కోసం పండ్లు, మొక్కజొన్న కంకులు
- ఉమ్మెత్తకాయ
- కొబ్బరికాయ
- పసుపు గణపతి నైవేద్యానికి బెల్లం ముక్క
- అక్షింతలు
- మామిడాకులు
- అరటి పిలకలు
- అరటి ఆకులు
- దీపారాధన కుందులు
- దీపారాధన వత్తులు
- ఆవునెయ్యి/నువ్వుల నూనె (దీపారాధనకు)
- అగర్బత్తీలు
- కర్పూరం బిళ్లలు
- అగ్గిపెట్టె
- ఆచమనం కోసం పంచపాత్ర, ఉద్ధరిణి
- కలశం కోసం చెంబు
- నీళ్లు (అవకాశం ఉంటే గంగా జలం)
- వినాయకుని ఆసనం
- పూజ చేసే వారికి ఆసనం
- విఘ్నేశ్వరుని ప్రతిమ
- వినాయకునికి యజ్ఞోపవీతం
- వినాయకునికి వస్త్రం
- వినాయకుని పూజ కోసం పత్రి
- మాచీపత్రం
- బృహతీపత్రం
- బిల్వపత్రం (మారేడు దళం)
- దూర్వారయుగ్మము (గరిక )
- దత్తూర పత్రం
- బదరీ పత్రం (రేగు ఆకు )
- అపామార్గపత్రం
- తులసీపత్రం
- చూతపత్రం
- కరవీరపత్రం
- విష్ణుకాంతపత్రం
- దాడిమీపత్రం
- దేవదారుపత్రం
- మరువకపత్రం
- సింధువారపత్రం
- జాజీపత్రం
- గండకీపత్రం
- శమీపత్రం
- అశ్వత్తపత్రం
- అర్జునపత్రం
- అర్కపత్రం
మొత్తం 21 రకాల పత్రాలుపూజ పూర్తి అయిన తర్వాత వినాయకుని 21 లేదా 11 లేదా 9 లేదా 5 మీ శక్త్యానుసారం పిండివంటలతో, పప్పు కూర పులుసు పచ్చడి వంటి అనుపానాలతో మహా నైవేద్యం. చివరగా తాంబూలం, దక్షిణ సమర్పించాలి. ఇంకెందుకు ఆలస్యం. ఈ పూజా సామాగ్రి పట్టిక ప్రకారం అన్నీ సిద్ధం చేసుకుందాం. వినాయక చవితి పండుగను ఏ లోటు లేకుండా ఆనందంగా జరుపుకుందాం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.